SlumDogHusband: బన్నీ ట్రైలర్ చూసి అందరికీ చూడమని చెప్పారు: బ్రహ్మాజి

ABN , First Publish Date - 2023-07-27T17:48:51+05:30 IST

సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వందల సినిమాల్లో వివిధ రకాలైన పాత్రలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు అతని కుమారుడు కథానాయకుడిగా నటిస్తున్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమాలు ఒక విలక్షణమైన పాత్ర వేస్తున్నట్టు చెప్పారు. అది తెరమీద చూసి అందరూ నవ్వుకోవాల్సిందే అని అంటున్నారు.

SlumDogHusband: బన్నీ ట్రైలర్ చూసి అందరికీ చూడమని చెప్పారు: బ్రహ్మాజి
Brahmaji

సంజయ్ రావు (SanjayRao), ప్రణవి మానుకొండ (PranaviManukonda) జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (SlumDogHusband). చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (PuriJagannadh) శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న బ్రహ్మాజి ఈ సినిమా గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో బ్రహ్మాజీ తన పాత్ర గురించి చెపుతూ, మామూలుగా తను చేసే పాత్రలు కొత్తగా ఏవీ రావని, ఎందుకంటే తన కెరీర్ లో అన్ని రకాలు పాత్రలు చేసానని చెప్పారు. "కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది నాకు. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ పాత్ర, విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను," అని చెప్పారు బ్రహ్మాజీ.

brahmaji5.jpg

'మిస్టర్ ప్రెగ్నెంట్' (MrPregnant) సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పిరెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం, అని చెప్పాడు.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ డాగ్ లవర్ కూడా అవ్వడంతో ఈ సినిమాలోని కథకి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఈమధ్య 'పుష్ప' (Pushpa) పార్ట్ 2 రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది, బన్నీ (AlluArjun)కి ఆ ట్రైలర్ చూపిస్తే అతను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు, అనటమే కాకుండా టీం అందరికీ చెప్పి చూపించాడు కూడా, అని అల్లు అర్జున్ ఈ ట్రైలర్ గురించి ఎంత ప్రశంసించారో చెప్పారు బ్రహ్మాజీ (Brahmaji).

brahmaji2.jpg

అలాగే ఇంట్లో సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటాం అని చెప్పారు బ్రహ్మాజీ, అలాగే కుమారుడికి సినిమాల గురించి ఏమీ సలహాలు కూడా ఇవ్వను అని నారు. అందరిలా సినిమాలు చేస్తే ఏముంటుంది, కొంచెం కొత్తగా ప్రయత్నించు చూడు అని మాత్రం చెబుతుంటాను. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ఎంచుకోమని చెబుతాను. అదే బెటర్ ఆప్షన్ అని సలహా ఇస్తా.

ఇందులో కమెడియన్ సప్తగిరి కూడా వున్నాడు. అతను బ్రహ్మాజీ కి మంచి స్నేహితుడు అని చెప్పాడు. ఈ సినిమాలో ఈ ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి అని, సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి అని చెపుతూ, జడ్జిగా ఫిష్ వెంకట్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది అని చెప్పాడు బ్రహ్మాజీ.

brahmaji.jpg

ముందుగా ఈ సినిమాని జూలై 21న విడుదల చేయాలని అనుకున్నారు, కానీ అదే సమయంలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం అని చెప్పారు. జూలై 28న 'బ్రో' రిలీజ్ అవుతోంది. ఆ సినిమాకు టికెట్లు దొరక్కపోతే మా సినిమాకే వస్తారు (నవ్వుతూ). 'స్లమ్ డాగ్ హజ్బెండ్ స్టోరీని' ఆర్జీవీ గారికి వినిపిస్తే.. 'కుక్క మొగుడు' అని టైటిల్ పెట్టమని అన్నారట. కానీ నిర్మాతలు మాత్రం 'స్లమ్ డాగ్ హజ్బెండ్' అని పెడితేనే బాగుంటుందని అన్నారు.

అనిల్ రావిపూడి (AnilRavipudi) స్టార్ డైరెక్టర్. ఆయన తన పీక మీద కత్తి పెట్టించుకుని సినిమాలు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన స్క్రిప్ట్ రాసి అలా చేద్దాం, ఇలా చేద్దామని ఇచ్చారు. నిజంగా ఆయన గ్రేట్. ప్రతీ చోట అందరూ నాకు సాయం చేస్తూనే వచ్చారు అని చెప్పారు బ్రహ్మాజీ. అలాగే ఇంకా ప్రదీప్, అలీ, నాగార్జున (Nagarjuna) ఇలా అందరూ బ్రహ్మాజీకి సపోర్ట్ చేశారు. "ఇలా అందరి ప్రేమను సంపాదించుకోవడమే నా ఆస్తిగా ఫీలవుతాను," అని అన్నారు బ్రహ్మాజీ.

brahmaji1.jpg

సుకుమార్ (Sukumar) గారు ప్రీ రిలీజ్ వేడుకకు పిలిచినా వెంటనే వస్తాను అన్నారు, కానీ అతను అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది, అందుకని రాలేకపోతోన్నాను అన్నారు. అయితే వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు అని చెప్పారు. అలాగే సోషల్ మీడియాను సీరియస్ గా తీసుకోను అని, సరదాగా తీసుకుంటాను అని చెప్పారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాను అని చెప్పారు. అదే నా సీక్రెట్ కూడా అని చెప్పారు. కుళ్లుతో ఉంటే యంగ్‌గా కనిపించం, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే యంగ్‌గా కనిపిస్తాం అని చెపుతూ ఇప్పుడు ఎనభై ఏళ్లు దాటితేనే మాట్లాడుకోవాలి. అంత వరకు అందరూ యంగ్ అన్నట్టే అని నవ్వుతూ చెప్పారు.

సంగీత దర్శకుడు భీమ్స్ మంచి ఫాంలో ఉన్నారని, ఈ సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారని, ఈ సినిమా కతీతంగా మ్యూజికల్ హిట్ అవుతుంది అని చెప్పారు బ్రహ్మాజీ. అలాగే తను నటిస్తున్న 'పుష్ప' మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అదిరిపోతుంది. దాని బాబులా ఈ సినిమా ఉంటుంది. ఫాహద్ ఫాజిల్ పక్కనే కనిపిస్తాను. ఆయన కూడా ఈ మూవీ ట్రైలర్ చూశారు. మెచ్చుకున్నారు. వేరే భాషల్లోనూ ఈ కాన్సెప్ట్‌ను చేయొచ్చు అని అన్నారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు (MaheshBabu) 'గుంటూరు కారం' #GunturKaram, ప్రభాస్ (Prabhas) 'సలార్' (Salaar), బాలయ్య గారి 'భగవంత్ కేసరి', 'ఊరి పేరు భైరవకోన', నాగ శౌర్యతో ఓ సినిమా. ఇలా చాలానే ఉన్నాయి. ప్రభాస్ 'సలార్' సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను అని చెప్పారు బ్రహ్మాజీ.

Updated Date - 2023-07-27T17:48:51+05:30 IST