Thalapathy68: ఈ సినిమాకి విజయ్ పారితోషికం ఎంతో తెలిస్తే షాకై కిందపడతారు

ABN , First Publish Date - 2023-07-04T15:02:44+05:30 IST

తలపతి విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో 'లియో' అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉండగానే, తన తదుపరి సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు తో ప్రకటించాడు. అయితే ఈ వెంకట్ ప్రభు సినిమాకి విజయ్ పారితోషికం ఎంతో తెలుసా...

Thalapathy68: ఈ సినిమాకి విజయ్ పారితోషికం ఎంతో తెలిస్తే షాకై కిందపడతారు
Thalapathy Vijay

తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ #ThalapathyVijay ప్రస్తుతం 'లియో' #Leo అనే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీనికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక హై బడ్జెట్ సినిమా, ఇందులో చాలామంది నటీనటులు వున్నారు. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (SanjayDutt) తో పాటు, అర్జున్ సర్జా (ArjunSarja), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVasudevMenon) కూడా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19 (October19) న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది అని కూడా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు.

thalapathy681.jpg

అయితే ఈ సినిమా తరువాత విజయ్ తన తదుపరి సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు (VenkatPrabhu) తో అధికారికంగా మే నెలలో ప్రకటించారు. దానికి ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు కానీ ఆ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి 'తలపతి68' #Thalapathy68 అని మాత్రమే పిలుస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని ఇప్పుడు నడుస్తోంది. ఈమధ్యనే వెంకట్ ప్రభు దర్శకత్వం చేసిన సినిమా 'కస్టడీ' #Custody నాగ చైతన్య (NagaChaitanya), కృతి శెట్టి (KrithiShetty) జంటగా తెలుగు, తమిళంలో విడుదల అయింది.

ఈ 'కస్టడీ' సినిమా ప్లాప్ అయింది, అయినా వెంటనే ప్రభు, విజయ్ తో సినిమా ప్రకటించటం ఆసక్తికరం. అయితే ఈ 'తలపతి 68' #Thalapathy68 సినిమాకి విజయ్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. బహుశా ఇంత పారితోషికం ఎవరూ తీసుకోలేదేమో మన దక్షిణాదిలో, ఇంతకీ విజయ్ పారితోషికం ఎంతో తెలుసా, రూ. 175 కోట్లు (175 crore). అవును అక్షరాలా 175 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అని ఇటు తెలుగు, అటు తమిళ పరిశ్రమలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాని ఇంతకు ముందు విజయ్ తో 'బిగిల్' (Bigil) అనే సినిమా చేసిన ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్ (AGSEntertainment), ఈ తలపతి68 ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Updated Date - 2023-07-04T15:02:44+05:30 IST