Yash: జపాన్‌లో ‘కేజీఎఫ్‌’.. వీడియో వైరల్‌

ABN , First Publish Date - 2023-07-07T15:46:32+05:30 IST

కేజీఎఫ్‌’ రెండు చిత్రాలు ఎంతగా ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే! విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపించి మేకర్స్‌కు ప్యాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు ధైర్యంగా చేయవచ్చనే స్ఫూర్తిని కలిగించింది. యశ్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం ప్రతిభకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదలకు సిద్థమైంది.

Yash: జపాన్‌లో ‘కేజీఎఫ్‌’.. వీడియో వైరల్‌

‘కేజీఎఫ్‌’ (KGF) రెండు చిత్రాలు ఎంతగా ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే! విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపించి మేకర్స్‌కు ప్యాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు ధైర్యంగా చేయవచ్చనే స్ఫూర్తిని కలిగించింది. యశ్‌ (Yash) నటన, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం ప్రతిభకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదలకు సిద్థమైంది. ఈ నెల 14న సినిమాను జపాన్‌లో విడుదల చేయనున్నారు. దీంతో యశ్‌ అక్కడి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా వీడియో వదిలారు. (KGF in Japan)

‘హల్లో జపాన్‌ నమస్తే...

నా చిత్రాలు ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2 చిత్రాలు ఇప్పుడు జపాన్‌లో విడుదల కానున్నాయి. కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నా. బలం, గుర్తింపు, పవర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ అన్ని సమపాళ్లలో ఉన్న చిత్రమిది. మీకు అద్భుతమైన వినోదాన్ని పంచుతాయి. రాఖీభాయ్‌ మ్యాడ్‌నెస్‌ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. థియేటర్‌లో మీ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం మరచిపోవద్దు’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు యశ్‌.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మరో వైపు అభిమానులు ‘కేజీఎఫ్‌3’ గురించి అప్‌డేట్‌ అడుగుతున్నారు. అయితే ఈ ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని గతంలో మేకర్స్‌ చెప్పారు. ‘సలార్‌’ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-07-07T15:46:32+05:30 IST