Vijay: లియో లుక్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2023-06-22T12:36:42+05:30 IST

తమిళ హీరో విజయ్‌ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’(Leo). లోకేశ్‌ కనకరాజు (Lokesh Kanagaraju) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గురువారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా లియో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Vijay: లియో లుక్‌ వచ్చేసింది!

తమిళ హీరో విజయ్‌ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’(Leo). లోకేశ్‌ కనకరాజు (Lokesh Kanagaraju) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గురువారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా లియో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు లోకేశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు.

ఇందులో విజయ్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఆకాశాన్ని చూస్తున్న ఓ వ్యక్తి అరచేయి. ఊడి గాల్లో ఎగురుతున్న పళ్లు, విజయ్‌ చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్‌ గ్యాంగ్‌ విజయ్‌ పై దాడి చేయడానికి వస్తే వాళ్ల అంతు చూసినట్లుగా కనిపిస్తుంది. పోస్టర్‌ చూస్తుంటే పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా అతి భయానకంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ఫుల్‌ క్లారిటీ రావాలంటే ట్రైలర్‌ వచ్చే వరకు వెయిట్‌ చేయాలి. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను ‘నా రెడీ’ పాటను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. త్రిష (Trisha) కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌ కీలక పాత్రధారులు. సెవెన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై ఎస్‌.ఎస్‌ లలిత్‌ కుమార్‌, జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మరోవైపు నేడు విజయ్‌ పుట్టినరోజు కావడంతో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌ సెలబ్రిటీలు, అభిమానుల నుంచి విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-06-22T12:53:32+05:30 IST