కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rip Spandana: కన్నడ నటుడికి సతీవియోగం!

ABN, First Publish Date - 2023-08-07T14:33:18+05:30

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు, ప్లేబ్యాక్‌ సింగర్‌ విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన (38) గుండె పోటుతో మరణించారు. విజయ్‌ కుటుంబ సభ్యులు బ్యాంకాక్‌ విహారానికి వెళ్లగా.. అక్కడ స్పందనకు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు, ప్లేబ్యాక్‌ సింగర్‌ విజయ్‌ రాఘవేంద్ర (Vijay Raghavendra) భార్య స్పందన (Spandana 38) గుండె పోటుతో (heartAttack) మరణించారు. విజయ్‌ కుటుంబ సభ్యులు బ్యాంకాక్‌ విహారానికి వెళ్లగా.. అక్కడ స్పందనకు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్‌ నుంచి మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మంగళవారం బెంగళూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. స్పందన మరణవార్త తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ సోషల్‌ మీడియాల వేదికగా నివాళి అర్పించారు.

స్పందన బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి బికే శివరామ్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పని చేశారు. 2007 ఆగస్టు 26న స్పందన, విజయ్‌ల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. రాఘవేంద్ర.. కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌ కుమార్‌కు బంధువు. 2016లో వచ్చిన ‘అపూర్వ’ అనే సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు స్పందన.

Updated Date - 2023-08-07T14:39:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!