ThalapathyVijay68: ప్లాప్ దర్శకుడితో విజయ్ 68వ సినిమా

ABN , First Publish Date - 2023-05-22T12:43:03+05:30 IST

ఈమధ్యనే నాగ చైతన్యతో తమిళ, తెలుగు భాషల్లో 'కస్టడీ' అనే సినిమా చేసిన వెంకట్ ప్రభు ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ 68వ సినిమాని దర్శకత్వం చేస్తున్నాడు. ఈ విషయాన్ని విజయ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కస్టడీ రెండు భాషల్లో డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ThalapathyVijay68: ప్లాప్ దర్శకుడితో విజయ్ 68వ సినిమా
Thalapathy Vijay

తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ (ThalapathyVijay) ప్రస్తుతం తన 67వ సినిమా 'లియో' (Leo) దర్శకుడు లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj) దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది కూడా, ఇది ఈ సంవత్సరం అక్టోబర్ 19 న విడుదల అవుతుందని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో త్రిష (TrishaKrishnan) కథానాయిక కాగా, చాలామంది మలయాళం, తమిళ నటులు ఇందులో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత విజయ్ తన 68వ #Thalapathy68 సినిమాని కూడా అధికారికంగా ప్రకటించారు. దీనికి వెంకట్ ప్రభు (VenkatPrabhu) దర్శకుడిగా చేస్తాడని, ఏజిఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌ అఘోరాం ఈ సినిమా నిర్మిస్తారని కూడా ప్రకటించారు. తన సాంఘీక మాధ్యమం ట్విట్టర్ లో విజయ్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. #Thalapathy68 అయితే వెంకట్ ప్రభు ఇంతకు ముందు చాల హిట్ సినిమాలు తీసాడు. అజిత్ కుమార్ (AjithKumar) తో 'మన్కత' (Mankatha), అలాగే 'చెన్నై 28' (Chennai28), 'మానాడు' (Maanadu) లాంటి సినిమాలు చేసాడు.

vijayvenkatprabhu.jpg

అయితే ఈమధ్యనే వెంకట్ ప్రభు సినిమా 'కస్టడీ' (Custody) విడుదల అయింది, ఇందులో నాగ చైతన్య (NagaChaitanya) కథానాయకుడిగా నటించగా, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయింది. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయింది. ఇందులో కృతి శెట్టి (KrithiShetty) కథానాయిక కాగా, ఈ సినిమాని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.

ఇదిలా ఉండగా, వెంకట్ ప్రభు దర్శకత్వం లో విజయ్ అనగానే కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే విజయ్ ని దర్శకత్వం చెయ్యడం అంటే మాటలు కాదు. అతను ఇప్పుడు చాలా క్రేజ్ వున్న స్టార్, అతనితో సినిమా అంటే చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఉంటుంది.

Updated Date - 2023-05-22T12:43:03+05:30 IST