Vara Lakshmi Sarathkumar: డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మీకి సమన్లు...

ABN , First Publish Date - 2023-08-29T16:05:55+05:30 IST

శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మీ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలాకాలంగా వరలక్ష్మి దగ్గర పీఏగా పని చేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్‌ కేసులో కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్లు కొచ్చి పోలీసులు గుర్తించారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్లతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయి.

Vara Lakshmi Sarathkumar: డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మీకి సమన్లు...

శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మీ డ్రగ్స్‌ (Vara Lakshmi Sarath kumar) కేసుకు సంబంధించి కొచ్చి ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలాకాలంగా వరలక్ష్మి దగ్గర పీఏగా పని చేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్‌ కేసులో (Drugs case) కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్లు కొచ్చి పోలీసులు గుర్తించారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్లతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయి. దీంతో ఆదిలింగంను ఎన్‌ఐఏ అధికారుల అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

డ్రగ్స్‌ బిజినెస్‌ ద్వారా వస్తున్న మొత్తాన్ని సినిమా పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నాడని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో ఆదిలింగంకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నటి వరలక్ష్మిని విచారించడానికి ఎన్‌ఐఏ అధికారులు సమన్లు జారీచేశారు. వరలక్ష్మికి కూడా గతంలో అతను డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తుంది. దీని వెనుక కోలీవుడ్‌కు చెందినవారు ఎవరెవరు ఉన్నరో అన్న కోణంలో విచారణ చేస్తునట్లు అధికారులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌ కేసుతో కోలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల యశోద, వీరసింహారెడ్డి, మైఖేల్‌ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన ఆమె తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే!

Updated Date - 2023-08-29T16:06:26+05:30 IST