Vanitha Vijaykumar : దాడికి కారణం అతడేనని అనుమానం!

ABN , First Publish Date - 2023-11-26T14:10:44+05:30 IST

గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడంటూ నటి వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు. కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7’లో వనితా పాల్గొన్నారు. అందులో ఓ కంటిస్టెంట్‌ మద్దతుదారుడే ఈ దాడికి దిగి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

Vanitha Vijaykumar : దాడికి కారణం అతడేనని అనుమానం!

గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడంటూ నటి వనితా విజయ్‌కుమార్‌ (Vanitha Vijaykumar) తెలిపారు. కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌ (biggboss Tamil) 7’లో వనితా పాల్గొన్నారు. అందులో ఓ కంటిస్టెంట్‌ మద్దతుదారుడే ఈ దాడికి దిగి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. "శనివారం రాత్రి బిగ్‌బాస్‌ రివ్యూ పూర్తి చేసుకుని తదుపరి నా సోదరి సౌమ్య నివాసంలో భోజనం చేసి నా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి నాపై దాడి చేశాడు. నా ముఖంపై తీవ్రగాయం చేసి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని నా సోదరి చెప్పిన న్యాయం జరగదని ఫిర్యాదు చేయలేదు. ప్రథమ చికిత్స అనంతరం.. నాపై దాడి చేసిన వ్యక్తి గురించి ఆలోచించా. అతడి మాటల నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. బిగ్‌బాస్‌ కంటిస్టెంట్‌ ప్రదీప్‌ ఆంటోనీ మద్దతు దారుడే ఈ దాడికి పాల్పడి ఉంటాడని నాకు అనిపిస్తోంది. నా ముఖానికి గాయం కావడంతో కొన్ని రోజుల పాటు కెమెరా ముందుకు రావాలనుకోవడం లేదు. దయచేసి నాకు ఎవరూ కాల్‌ చేయవద్దు. ఈ విషయంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు’’ అంటూ ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Updated Date - 2023-11-26T16:42:44+05:30 IST