Identity- Trisha: ప్రచారమే నిజమైంది... టొవినొ ప్రకటన!

ABN , First Publish Date - 2023-07-10T14:27:30+05:30 IST

‘ఐడెంటిటీ’ చిత్రంలో త్రిష భాగం కాబోతుందనే వార్త కొంతకాలంగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! ఆ ప్రచారమే నిజమైంది. ఇదే విషయాన్ని ఆధికారికంగా ప్రకటించారు హీరో టొవినో థామస్‌.

Identity- Trisha: ప్రచారమే నిజమైంది... టొవినొ ప్రకటన!

‘ఐడెంటిటీ’ (Identity) చిత్రంలో త్రిష (Trisha) భాగం కాబోతుందనే వార్త కొంతకాలంగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! ఆ ప్రచారమే నిజమైంది. ఇదే విషయాన్ని ఆధికారికంగా ప్రకటించారు హీరో టొవినో థామస్‌ (tovino Thomas). ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘2018’ (2018 movie) భారీ విజయం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ దర్శకులు. ఈ చిత్రంలో త్రిష లీడ్‌ రోల్‌ చేస్తుండగా టొవినో నెగటివ్‌ షేడున్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘‘త్రిష కృష్ణన్‌ మా సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆమెతో కలిసి పని చేస్తుండడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. త్వరలోనే మర్చిపోలేని సినిమా ప్రయాణం మొదలవుతుంది’ అని టొవినో థామస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం సెప్టెంబరులో చిత్రీకరణ మొదలు కానుంది. రాజు మల్యత్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-10T14:27:55+05:30 IST