Vijay: తన పొలిటికల్ ఎంట్రీ పై సంచలన ప్రకటన చేయనున్నాడా...

ABN , First Publish Date - 2023-07-12T13:02:29+05:30 IST

రాజకీయాల్లోకి మరో సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈసారి తమిళనాడు రాష్ట్రం నుండి. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న తలపతి విజయ్ రాజకీయ ఎంట్రీ పై త్వరలో ప్రకటన చేయనున్నాడని తమిళనాడు రాష్ట్రం అంతా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగా విజయ్ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి అభిమాన సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Vijay: తన పొలిటికల్ ఎంట్రీ పై సంచలన ప్రకటన చేయనున్నాడా...
Thalapathy Vijay

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో విజయ్ (ThalapathyVijay) ఒకరు. అదీ కాకకుండా, చాలా మాస్ ఫాలోయింగ్ వున్న నటుల్లో కూడా విజయ్ ఒకరు. అయితే ఈమధ్య విజయ్ రాజకీయాల్లోకి వస్తారు అంటూ చాలా వార్తలు చాలా రోజుల నుండి వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ఇక సినిమాలు ఆపేస్తారు, చెయ్యరు ఇదే లాస్ట్ సినిమా అనే వార్త తో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఖాయం అని కూడా అంటున్నారు.

అయితే ఈ వార్తలకి బలం చేకూరే విధంగా విజయ్ ఈ మధ్య తన అభిమాన సంఘాల నాయకులతో విరివిగా చర్చలు జరుపుతున్నారు. ఈమధ్య పదవ, 12వ తరగతి పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధులకి విజయ్ సన్మానించడమే కాకుండా, నగదు బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే తమిళ నాడులో రాష్ట్రంలో వున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తన అభిమాన సంఘాలను సామజిక సేవ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

Thalapathy-67.jpg

ఇప్పుడు విజయ్ 'లియో' #Leo సినిమా షూటింగ్ ముగించారు. #Thalapathy67 ఈ సినిమా లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj) దర్శకత్వం చేస్తుండగా, అక్టోబర్ 19 న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే విజయ్ తన అభిమాన సంఘం నాయకులతో సమావేశమయ్యారు అని తెలిసింది. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు ఉండొచ్చని, ఇందులో విజయ్ కేవలం తాను రాజకీయాల్లోకి రావటం, రాష్ట్రంలో సమస్యలు, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సినిమాలకి స్వస్తి చెప్పడం లాంటి అంశాలు చర్చకి వచ్చాయి అని కూడా అంటున్నారు.

విజయ్ అభిమాన సంఘాల నాయకులూ విజయ్ కి పూర్తి మద్దతు తెలిపినట్టుగా కూడా తెలిసింది. ఒకవేళ రాజకీయాల్లోకి విజయ్ వస్తే, అతనితోపాటు ఉంటాం అని అందరూ హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ సమావేశంలో తమిళ నాడు రాష్ట్రంలో (TamilNadu) వున్న ముఖ్య సమస్యలపై దీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, అసీంబ్లీ నియోజక వర్గాల వారీగా వున్న సమస్యలు అడిగి తెలుసుకున్నాడు అని కూడా తెలిసింది. అంటే ఇక విజయ్ రాజకీయాల్లోకి రావటం తధ్యం అని కూడా అంటున్నారు. ఈ 'లియో' సినిమా తరువాత, #Thalapathy68 దర్శకుడు వెంకట్ ప్రభు (VenkatPrabhu) తో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు.

ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకుంటే, పాదయాత్ర చేసినప్పుడు ఆయా సమస్యలని ప్రజలతో మాట్లాడవచ్చు అని కూడా అంటున్నారు. అందుకే 'లియో' #Leo సినిమా విడుదలకి ముందే ఈ పాదయాత్ర చేయనున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం గురించి తమిళనాడులో ఎక్కడ చూసిన ఇదే విషయం మీద చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే రానున్న కొన్ని రోజుల్లో విజయ్ పొలిటిక్ ఎంట్రీపై ఒక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని అతని అభిమానులు అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.

Updated Date - 2023-07-12T13:02:29+05:30 IST