Vijayakanth: కెప్టెన్ విజ‌య్‌కాంత్ అంత్య‌క్రియ‌లు.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై చెప్పుతో దాడి

ABN , Publish Date - Dec 29 , 2023 | 05:55 PM

త‌మిళ ఆగ్ర న‌టుడు విజయకాంత్ అంత్య‌క్రియ‌ల్లో చిన్న అప‌శృతి చోటు చేసుకుంది. నివాళులు అర్పించి వెళుతున్న‌ లియో సినిమా హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై మ‌రో హీరో అభిమానులు చెప్పు విసిరారు. ఇప్పుడు ఈ విష‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

Vijayakanth: కెప్టెన్ విజ‌య్‌కాంత్ అంత్య‌క్రియ‌లు.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై చెప్పుతో దాడి
VIJAY KANTH

గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డిన‌ త‌మిళ ఆగ్ర న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు డీఎండీకే (DMDK) అధినేత విజయకాంత్‌ (Vijayakanth) చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ నిన్న (గురువారం) మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. దీంతో అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో త‌మిళ‌నాడు రాష్ట్ర‌మంత‌టా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించడంతో పాటు రెండు రోజులు సంతాప‌ దినాలు పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేవ‌లం నటుడిగానే కాకుండా పొలిటీషియ‌న్‌గా, మాన‌వ‌తా వాదిగా, సిసలైన‌ త‌మిళవాదిగా ప్రజల్లో చిర‌స్థాయి ముద్ర వేసుకున్న విజయ్‌ కాంత్ మృతితో అభిమానులతో పాటు, యావత్‌ తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్ర‌వారం విజ‌య్‌కాంత్ (Vijayakanth) పార్థివదేహానికి ఆంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల్సి ఉండ‌డంతో ఆయ‌న మృత‌దేహాన్ని గురువారం రాత్రి డీఎండీకే ప్రధాన కార్యాలయానికి త‌ర‌లించారు.


ఈ క్ర‌మంలో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఆగ్ర న‌టుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచే విజ‌య్ కాంత్‌ను చివ‌రి చూపులు చూడ‌డానికి ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈక్ర‌మంలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌, విజ‌య్ అంటోని, మ‌న్సూర్ అలీఖాన్ వంటి న‌టులు స్వ‌యంగా వెళ్లి విజ‌య్ కాంత్ మృత‌దేహానికి నివాళులు అర్పించారు.

అయితే లియో సినిమా హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ నివాళులర్పించి విజ‌య్‌కాంత్ (Vijayakanth) భార్య ప్రేమ‌ల‌త‌ను ప‌రామ‌ర్శించి కారులో ఇంటికి వెళుతుండ‌గా వేరే హీరో అభిమానులు విజ‌య్ (Thalapathy Vijay)పై చెప్పులు విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలోనే కాకుండా త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌ను పార్టీల నాయ‌కులు, సినీ అభిమానులు తీవ్రంగా మండి ప‌డుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం అంటూ ఖండించారు.

Updated Date - Dec 29 , 2023 | 06:04 PM