Yogi Babu: భారతీరాజాతో నటించడం నా అదృష్టం

ABN , First Publish Date - 2023-01-17T20:19:25+05:30 IST

డైరెక్టర్‌ తంగర్‌ బచ్చన్‌ (Thangar Bachan) తెరకెక్కిస్తున్న ‘కారుమేగంగల్‌ కలైగిండ్రిన’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా

Yogi Babu: భారతీరాజాతో నటించడం నా అదృష్టం
Yogi Babu

డైరెక్టర్‌ తంగర్‌ బచ్చన్‌ (Thangar Bachan) తెరకెక్కిస్తున్న ‘కారుమేగంగల్‌ కలైగిండ్రిన’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శక శిఖరం భారతీరాజా, గౌతం వాసుదేవ్‌ మేనన్‌, అదితి బాలన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి యోగిబాబు మాట్లాడుతూ..

‘‘ఈ సినిమాలో భారతీరాజా (Bharathiraja) వంటి గొప్ప వారితో కలిసి నటించే మహాభాగ్యాన్ని దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ కల్పించారు. ఇది జీవితంలో మరచిపోలేని గొప్ప అనుభవం, అదృష్టం కూడా. వీరంతా సినిమా రంగంలో యోధులు. తంగర్‌ బచ్చన్‌ కోరినందునే ఇందులో నటించేందుకు అంగీకరించాను. వారితో కలిసి ప్రయాణం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మున్ముందు కూడా తంగర్‌ బచ్చన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఒక మంచి కథలో గొప్ప నటీనటులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని యోగిబాబు (Comedian Yogi Babu) తెలిపారు.

Updated Date - 2023-01-17T20:19:26+05:30 IST