సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chaithra First LooK: భయపెడుతోన్న హాట్ బ్యూటీ

ABN, First Publish Date - 2023-01-17T17:50:13+05:30

నటి యాషికా ఆనంద్‌ (Yashika Anand) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘చైత్రా’ (Chaithra) మూవీ ఫస్ట్‌లుక్‌ సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేశారు. ఇందులో యాషికా భయపెట్టేలా..

Yashika Anand in Chaithra Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటి యాషికా ఆనంద్‌ (Yashika Anand) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘చైత్రా’ (Chaithra) మూవీ ఫస్ట్‌లుక్‌ సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేశారు. ఇందులో యాషికా భయపెట్టేలా కనిపిస్తోంది. మార్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై నిర్మాతలు మనోహరన్‌, కన్నన్‌ వరదరాజ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ హార్రర్‌ చిత్రానికి ‘చైత్రా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. యాషికాతో కలిసి అవితేజ్‌, శక్తి మహేంద్ర, పూజ, రమణన్‌, కన్నన్‌, లూయిస్‌ తదితరులు నటించగా, జెనీత్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రభాకరన్‌ మెయ్యప్పన్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. (Chaithra First Look)

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు జెనీత్‌ కుమార్‌ (Jenith Kumar) మాట్లాడుతూ... ఇది 24 గంటల్లో జరిగే స్టోరీ. ‘పిజ్జా’, ‘డీమాంటి కాలనీ’ తరహాలో.. భిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరూ చూడని ఆసక్తిర సన్నివేశాలతో పూర్తిస్థాయి థ్రిల్లర్‌ జోనర్‌లో తెరెక్కిస్తున్నాం. తిరునెల్వేలి జిల్లాలోని కావల్‌ అనే గ్రామ ప్రాంతంలో షూటింగ్‌ చేశాం. ప్రస్తుతం చివరి దశ నిర్మాణ పనులు జరుపుకున్నాయి. త్వరలో థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. కాగా.. యాషికా విషయానికి వస్తే.. ఈ మధ్యే ఆమె ఓ భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ ఇప్పుడు బిజీ నటిగా మారుతోంది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో కూడా ఆమె హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ఇప్పుడు ‘చైత్రా’తో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - 2023-01-17T17:50:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!