సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#Thalapathy67: విజయ్, లోకేశ్ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా..

ABN, First Publish Date - 2023-02-02T13:31:14+05:30

తమిళంలోని స్టార్ హీరోల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. కోలీవుడ్‌ (Kollywood)లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Vijay
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళంలోని స్టార్ హీరోల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. కోలీవుడ్‌ (Kollywood)లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటుడికి తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. ఇటీవలే ‘వారసుడు’ (Vaarasudu) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ‘దళపతి67’పై విపరీతమైన చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ‘#Thalapathy67’ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కావడమే.

కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాతో లోకేశ్‌కి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ వచ్చింది. గతేడాది వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ ఆయనకి పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఈ సినిమాలని లింక్ చేస్తూ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)నే సృష్టించాడు. ఇందులో కార్తీ, కమల్ హాసన్, సూర్య ఇప్పటికే భాగంగా కాగా.. త్వరలో విజయ్ కూడా చేరబోతున్నాడు. దీంతో ‘దళపతి 67’పై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్, లోకేశ్ అభిమానులు ‘#Thalapathy67’ని ట్విట్టర్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో విజయ్‌కి జోడీగా త్రిష నటించనుంది. దీంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చి #Trisha కూడా ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి మరి.

Updated Date - 2023-02-02T13:31:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!