సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Antony: ‘పెద్ద సర్జరీ అయ్యింది.. త్వరలోనే మాట్లాడతా’

ABN, First Publish Date - 2023-01-25T12:19:55+05:30

‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో టాలీవుడ్‌లోనూ పాపులారిటీ సాధించిన కోలీవుడ్ నటుడు ‘విజయ్ ఆంటోనీ’ (Vijay Antony). అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమాని తెలుగులోనూ విడుదల అవుతోంది.

Vijay Antony
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో టాలీవుడ్‌లోనూ పాపులారిటీ సాధించిన కోలీవుడ్ నటుడు ‘విజయ్ ఆంటోనీ’ (Vijay Antony). అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమాని తెలుగులోనూ విడుదల అవుతోంది. కాగా.. ‘బిచ్చగాడు’కి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇటీవల మలేషియాలో జరిగింది. ఈ తరుణంలో ప్రమాదం జరగడంతో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

అయితే విజయ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోమాలో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో రూమర్స్‌పై తాజాగా విజయ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. విజయ్ తాజాగా చేసిన ట్వీట్లో.. ‘డియర్ ఫ్రెండ్స్, మలేషియాలో పిచైక్కారన్ 2 (బిచ్చగాడు 2) షూటింగ్ సమయంలో నా దవడకి,ముక్కుకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత త్వరలో మీ అందరితో మాట్లాడతాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2023-01-25T12:19:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!