Vijay Antony : ‘బిచ్చగాడు 2’ షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్‌కి గాయాలు
ABN , First Publish Date - 2023-01-17T09:36:11+05:30 IST
‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని (Vijay Antony).

‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని (Vijay Antony). తాజాగా విజయ్ ఓ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మలేషియాలో ‘బిచ్చగాడు’ సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ బోటులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే బోటు అదుపు తప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. చిత్ర యూనిట్ ఆయనను హుటాహుటిన కౌలాలంపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. అయితే విజయ్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది.
2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కోలీవుడ్ (Kollywood)తోపాటు టాలీవుడ్‌లోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2)కు ప్రస్తుతం విజయ్ ఆంటోనీయే దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాకుండా తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్‌పై ఈ చిత్రాన్ని తనే స్వయంగా నిర్మిస్తున్నాడు.