Vijay Antony: పరిస్థితి విషమం.. నిజమేనా?

ABN , First Publish Date - 2023-01-19T11:16:27+05:30 IST

‘పిచ్చైకారన్‌’ 2’ (బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణలో ప్రమాదానికి గురైన నటుడు, నిర్మాత విజయ్‌ ఆంటోని ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన భార్య ఫాతిమా స్పందించారు.

Vijay Antony: పరిస్థితి విషమం.. నిజమేనా?

‘పిచ్చైకారన్‌’ 2’ (Pichaikkaran2) (బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణలో ప్రమాదానికి గురైన నటుడు, నిర్మాత విజయ్‌ ఆంటోని (Vijay antony) ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన భార్య ఫాతిమా (Fatima)స్పందించారు. విజయ్‌ పరిస్థితి విషయం అంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ‘‘విజయ్‌ నడుముకు స్వల్వ గాయమైంది. దాన్నుంచి కోలుకుని త్వరలోనే తన సినిమా పనులు చేసుకోనున్నారు. మీడియాలో వస్తునట్లు ఆయనకేమీ పెద్ద ప్రమాదం జరగలేదని ఆరోగ్యంగానే ఉన్నారు’’ అని బుధవారం ఆమె తెలిపిన సంగతి తెలిసిందే! అయితే గురువారం ఉదయం నుంచి మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది, విజయ్‌ ఆంటోని పరిస్థితి విషమంగా ఉందనే వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ విషయంపై విజయ్‌ భార్య, సన్నిహితులు స్పందించాల్సి ఉంది.

బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్‌గా ఆయన రూపొందిస్తున్న ‘పిచ్చైకారన్‌ 2’ చిత్రం షూటింగ్‌ మలేషియాలో జరుగుతోంది. జెట్‌ స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాల చిత్రీకరణ మలేషియాలోని లంకావి దీవిలో జరుగుతుండగా విజయ్‌కు గాయమైంది. ప్రస్తుతం ఆయన చైన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. నటుడిగా, దర్శకనిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా విజయ్‌ తనదైన మార్క్‌ చూపించారు.

Updated Date - 2023-01-19T11:28:52+05:30 IST