Udhayanidhi Stalin: సాఫ్ట్ టైటిల్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-02-16T13:59:17+05:30 IST

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). ‘శీనుగాడి లవ్‌స్టోరీ’, ‘కళగ తలైవన్‌’ మంచి గుర్తింపు పొందారు.

Udhayanidhi Stalin: సాఫ్ట్ టైటిల్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌
Udhayanidhi Stalin

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). ‘శీనుగాడి లవ్‌స్టోరీ’, ‘కళగ తలైవన్‌’ మంచి గుర్తింపు పొందారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘కన్నై నంబాదే’ (Kannai Nambathey). అంటే తెలుగులో ‘మీ కళ్లను నమ్మవద్దు’ అని అర్థం. ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు సిద్ధు కుమార్‌తో కలిసి దర్శకుడు ము.మారన్‌ (Mu.Maaran) తాజాగా ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో మాట్లాడాడు. ఆయన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మారన్ మాట్లాడుతూ.. ‘‘లవ్‌ స్టోరీ చేయాలన్న ఆలోచనతో ఉదయనిధిని సంప్రదించాను. ఆయన థ్రిల్లర్‌ జోనర్‌లో చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ‘కన్నై నంబాదే’ అనే సాఫ్ట్‌ టైటిల్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కించాం. ఆత్మిక హీరోయిన్‌. భూమిక చావ్లా ఓ ప్రధాన పాత్ర పోషించగా.. ప్రసన్న, సతీష్‌, సుభిక్ష కృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్‌ చిత్రాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మూడు పాటలున్నప్పటికీ రెండు ఆల్బమ్‌ సాంగ్స్‌గా వస్తాయి. లిపి సినీ క్రాఫ్ట్స్‌ బ్యానరుపై వీఎన్‌ రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. సంగీత దర్శకుడు సిద్ధు కుమార్‌ మాట్లాడుతూ.. ‘సాధారణంగా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో పాటలకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతమే బలం. ఇందులో కొత్తగా ట్రై చేశాం. చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

Updated Date - 2023-02-16T13:59:28+05:30 IST