Kanguva: సూర్యకి ప్రమాదం, షూటింగ్ నిలిపివేత

ABN , First Publish Date - 2023-11-23T13:35:36+05:30 IST

తమిళ నటుడు సూర్య కి ప్రమాదం జరిగింది. 'కంగువా' సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా, ఒక బరువైన కెమెరా సూర్య బుజం మీద పడినట్టుగా సమాచారం. షూటింగ్ ప్రస్తుతం నిలిపివేశారు, అయితే ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి సమాచారం రావలసి వుంది

Kanguva: సూర్యకి ప్రమాదం, షూటింగ్ నిలిపివేత
Tamil actor Suriya injured

తమిళ, తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం వున్న అగ్ర నటుల్లో సూర్య (Suriya) ఒకరు. అతను ఇప్పుడు ఒక పీరియడ్ యాక్షన్ సినిమా 'కంగువా' #Kanguva చేస్తున్నారు. ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లోని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా విడుదలవుతోంది, ఆమధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ బాగా వైరల్ అయినా సంగతి కూడా తెలిసిన విషయమే. ఈ సినిమాకి దర్శకుడు శివ, నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, ప్రమోద్, వంశీ కృష్ణలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా కథానాయకుడు సూర్యకి ప్రమాదం జరిగిందని తెలిసివచ్చింది. (Tamil actor Suriya injured while shooting Kanguva film)

kanguva-teaser1.jpg

‘కంగువా’షూటింగ్‌లో తమిళ స్టార్ సూర్యకు ప్రమాదం జరిగిందని, ఈ సినిమా కోసం ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఒక కెమెరా మీద పడడంతో సూర్య భుజానికి గాయం అయిందని తెలిసింది. సూర్యని దగ్గరలో వున్నా ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లారని, అలాగే షూటింగ్ ఆపివేసినట్టుగా కూడా తెలిసింది. (Tamil actor Suriya injured)

అయితే ఈ ప్రమాదం ఎంత పెద్దది అనే విషయం మీద ఇంకా సమాచారం రావలసి వుంది. సినిమా షూటింగ్ లో ఉపయోగించే కెమెరాలు చాలా బరువుగా వుంటాయని అందరికి తెలిసిన విషయమే. అలంటి కెమెరా బుజం మీద పడటంతో ఇది కొంచెం బలంగానే తగిలి ఉంటుందని షూటింగ్ లో అనుకుంటున్నారని తెలిసింది.

Updated Date - 2023-11-23T13:35:37+05:30 IST