సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay 67: సంజయ్‌దత్‌ ఆన్‌ బోర్డ్‌!

ABN, First Publish Date - 2023-01-31T16:57:54+05:30

విజయ్‌ హీరోగా నటిస్తున్న 67వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌ అడుగుపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ (Thalapathi vijay)హీరోగా నటిస్తున్న 67 (Vijay 67_వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh kanagaraj)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ (sanjay dutt)కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర బృందంతో పాటు సంజయ్‌ దత్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు సంజూ కొత్త లుక్‌ను విడుదల చేసి ‘సంజయ్‌దత్‌ మా చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అని యూనిట్‌ పేర్కొన్నారు. సంజద్‌ దత్‌ కూడా దీనిపై స్పందించారు. ‘‘విజయ్‌ 67’ లైన్‌ విన్నప్పుడు తప్పకుండా ఈ చిత్రంలో భాగం కావాలనుకున్నా. ఇప్పుడు ఈ జర్నీని ప్రారంభించడానికి ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. లలిత్‌కుమార్‌, జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. విక్రమ్‌, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ మీనన్‌ కీలక పాత్రధారులు.

Updated Date - 2023-01-31T16:57:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!