Rashmika Mandanna: ‘అలా చేస్తే మగాడిలా అవుతాను.. ఇలా చేస్తే లావవుతాను’

ABN , First Publish Date - 2023-01-24T13:09:11+05:30 IST

దక్షిణాదిలోని చిత్ర పరిశ్రమల్లోని టాప్ హీరోయిన్స్‌లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు.

Rashmika Mandanna: ‘అలా చేస్తే మగాడిలా అవుతాను.. ఇలా చేస్తే లావవుతాను’
Rashmika Mandanna

దక్షిణాదిలోని చిత్ర పరిశ్రమల్లోని టాప్ హీరోయిన్స్‌లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘వారసుడు’ ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. విజయ్ (Vijay) హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మికాది చాలా చిన్న పాత్ర. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అలాగే తన శరీరాకృతితో పాటు పలు ఇతర విషయాల్లోనూ సోషల్ మీడియా వేదిక పలువురు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై తాజాగా రష్మిక మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.

రష్మిక మాట్లాడుతూ.. ‘నేను ఏం చేసిన కొందరికీ అసలు నచ్చట్లేదు. నేను వర్కౌట్ చేస్తే.. మగాడిలా అవుతానంటారు. వర్కౌట్ చేయకపోతే లావు అవుతాను. నేను ఎక్కువ మాట్లాడితే వాగుడుకాయ. లేకపోతే యాట్యిట్యూడ్ అంటారు. చివరికీ నేను ఊపిరి పీల్చుకున్న, పీల్చుకోకపోయినా వారికి సమస్యే. నేను ఇండస్ట్రీలో ఉండాలా? లేక వెళ్లిపోవాలా? చెప్పండి’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. అయితే ‘సరిగ్గా, పద్ధతిగా చెబితే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వల్గర్‌గా మాట్లాడితే నేను మానసికంగా కుంగిపోతాన’ని రష్మిక తెలిపింది.

అలాగే ‘వారసుడు’ సినిమా తన పాత్రకి ప్రాధాన్యం లేదని తనకి ముందే తెలుసని రష్మిక చెప్పింది. కానీ.. చిన్నప్పటి నుంచి తన క్రష్ అయినా విజయ్‌తో కలిసి నటించడానికే ఆ క్యారెక్టర్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. కాగా.. ఆమె నటించిన ఓ బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అలాగే.. ఈ బ్యూటీ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ కాంబోలో వస్తున్న ‘యానిమల్’, ‘పుష్ప 2’లో నటిస్తూ బిజీగా ఉంది.

Updated Date - 2023-01-24T13:09:12+05:30 IST