Rajinikanth: రజినీకాంత్ తో రావు రమేష్

ABN , First Publish Date - 2023-11-18T11:56:14+05:30 IST

తెలుగులో వున్న అతికొద్దిమంది క్యారెక్టర్ నటుల్లో వైవిధ్యంగా నటించే నటుడు రావు రమేష్. అతనికి ఇప్పుడు ఒక పెద్ద ఛాన్స్ వచ్చిందని, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని తాజా భోగట్టా

Rajinikanth: రజినీకాంత్ తో రావు రమేష్
Rajinikanth and Rao Ramesh

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా వున్నారు. 'లాల్ సలాం' #LalSalaam సినిమా షూటింగ్ పూర్తి అయిపొయింది, దీనికి అతని కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (AishwaraRajinikanth) దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా తరువాత 'తలైవా 170' #Thalaivar170 కూడా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ (TJGnanavel) దర్శకత్వం వహిస్తున్నారు. అతను ఇంతకు ముందు 'జై భీం' #JaiBhim అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) కూడా నటిస్తున్నారు. రజినీకాంత్, అమితాబ్ కాంబినేషన్ సన్నివేశాల షూటింగ్ కూడా కొంత అయిందని కూడా తెలిసిన విషయమే.

raoramesh.jpg

ఇదే సినిమాలో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ (FahadhFaasil), మంజు వారియర్ (ManjuWarrier), రానా దగ్గుబాటి (RanaDaggubati), దర్శన్ ఇలా వీరందరితో పాటు తెలుగులో వైవిధ్యమైన నటుల్లో అగ్రస్థానంలో వున్న రావు రమేష్ (RaoRamesh) కూడా వున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం, రావు రమేష్ ఈమధ్యనే చెన్నై వెళ్లి రజినీకాంత్ తో వున్న సన్నివేశాలు కొన్ని ఈ 'తలైవా 170' సినిమాకి పూర్తి చేశారని కూడా అంటున్నారు.

దర్శకుడు జ్ఞానవేల్ ఇంతకుముందు రావు రమేష్ కి తన 'జై భీం' సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన విషయం తెలిసిందే. సూర్య నటించిన ఆ సినిమాలో రావు రమేష్ పాత్ర హైలైట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే దర్శకుడు ఒక ముఖ్యమైన పాత్రలో రావు రమేష్ మాత్రమే చేయగలరని అనుకుని, అతనికి ఈ రజినీకాంత్ సినిమాలో దర్శకుడు అవకాశం ఇచ్చినట్టుగా తెలిసింది. సినిమాలో రజినీకాంత్, రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయని కూడా చెన్నై పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. తమిళం బాగా వచ్చిన రావు రమేష్ ఈ సినిమాతో తమిళ సినిమాలలో మంచి క్యారెక్టర్ పాత్రలు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

Updated Date - 2023-11-18T11:56:16+05:30 IST