Rana Daggubati: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి చేస్తున్న సినిమా

ABN , First Publish Date - 2023-08-17T13:26:25+05:30 IST

రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ మంచి స్నేహితులు, ఎప్పుడూ టచ్ లో ఉంటూ వుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిపి ఒక సినిమా చేస్తున్నారు, సముద్రఖని ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ఇంతకీ దర్శకుడెవరో తెలుసా...

Rana Daggubati: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి చేస్తున్న సినిమా
Rana Daggubati and Dulquer Salman

నటుడు రానా దగ్గుబాటి (RanaDaggubati) 'విరాటపర్వం' #VirataParvam సినిమా తరువాత ఏమి చేస్తున్నాడు అని చాలామంది మదిలో మెదిలో ప్రశ్న. ఏదైనా సినిమా ఒప్పుకున్నాడా? 'విరాటపర్వం' తరువాత రానా ఏ సినిమా ఎందుకు ఒప్పుకోలేదు. రానాకి బాగా దగ్గరగా వున్నా వ్యక్తులు చెప్పేది ఏంటంటే, ఇంతవరకు రానాకి నచ్చిన కథ రాలేదు అందుకే అతను ఏ సినిమా చెయ్యలేదు అను చెప్పారు. కానీ ఇప్పుడు ఒక మంచి వార్త వచ్చింది, ఏంటంటే రానా, మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (DulquerSalman) తో చేతులు కలిపాడు ఒక సినిమా కోసం.

selvamaniselvaraj.jpg

ఇంతకీ విషయం ఏంటంటే రానా దగ్గుబాటి తన స్నేహితుడు దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా నిర్మాతగా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. ఇది తమిళ సినిమా అని, తరువాత తెలుగులోకి అలాగే మిగతా భాషల్లోకి కూడా డబ్బింగ్ అవుతుందని కూడా తెలిస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని (Samuthirakani) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టుగా తెలిసింది. ఇంతకీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా? సెల్వమణి సెల్వరాజ్ (SelvamaniSelvara). ఇతను తీసిన 'ది హంట్ ఫర్ వీరప్పన్' #TheHuntForVeerappan అనే ఒక సిరీస్ ఈమధ్యనే నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటిటి లో విడుదలైంది.

ఈ వెబ్ సిరీస్ కి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. సెల్వమణి సెల్వరాజ్ ఇప్పుడు ఈ దుల్కర్ సల్మాన్ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని తెలిసింది. అలాగే రానా దగ్గుబాటి ఈ సినిమాకి నిర్మాత. రానా ఇంతకు ముందు కొన్ని సినిమాలకి ప్రెజంటర్ గా, అలాగే కొన్ని చిన్న సినిమాలకి నిర్మాతగా వున్నా, ఇంత పెద్ద స్టార్ తో, ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం వుంది.

Updated Date - 2023-08-17T13:26:25+05:30 IST