ఆగస్టులో రజనీకాంత్ జైలర్
ABN , First Publish Date - 2023-04-25T23:43:37+05:30 IST
తలైవా రజనీకాంత్ సినిమా అన్నాత్తే’ (తెలుగులో అన్నయ్య) 2021లో విడుదలైంది.

తలైవా రజనీకాంత్ సినిమా అన్నాత్తే’ (తెలుగులో అన్నయ్య) 2021లో విడుదలైంది. ఆయన సినిమా వచ్చి రెండేళ్లు కావడంతో అభిమానులంతా కొత్త సినిమా ‘జైలర్’ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తలైవా కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్‌ను ఈ సినిమాలో సరికొత్తగా చూపించనున్నారు దర్శకుడు నెల్సన్. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు నటించిన ‘జైలర్’ షూటింగ్ హైదరాబాద్, చెన్నై, కేరళలో జరిగింది. వినాయకచవితి సందర్బంగా ఆగస్టులో ‘జైలర్’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.