Chandramukhi 2: నెట్టింట వైరల్‌గా మారిన రాఘవ లారెన్స్, వడివేలు పిక్

ABN , First Publish Date - 2023-02-23T17:52:27+05:30 IST

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘చంద్రముఖి’ (Chandramukhi). పీ.వాసు (P. Vasu) దర్శకత్వం వహించారు. శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajini Kanth), ప్రభు (Prabhu), జ్యోతిక, వడివేలు, నయనతార, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Chandramukhi 2: నెట్టింట వైరల్‌గా మారిన రాఘవ లారెన్స్, వడివేలు పిక్

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘చంద్రముఖి’ (Chandramukhi). పీ.వాసు (P. Vasu) దర్శకత్వం వహించారు. శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajini Kanth), ప్రభు (Prabhu), జ్యోతిక, వడివేలు, నయనతార, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపుగా 18ఏళ్ల అనంతరం ఈ చిత్రానికి సీక్వెల్ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన మూడో షెడ్యూల్ తాజాగా ముగిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను ప్రొడక్షన్ హౌస్ తాజాగా ప్రేక్షకులతో పంచుకుంది.

‘చంద్రముఖి 2’ ను పీ. వాసే తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kanganau Ranaut) టైటిల్ రోల్స్ చేస్తున్నారు. రాధికా శరత్ కుమార్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, టీఎమ్. కార్తిక్, శ్రుష్టి దాంగే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూడో షెడ్యూల్ ముగియడంతోనే మేకర్స్ అనేక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘పూర్తి స్థాయి చంద్రముఖిగా మారిన వడివేలుని చూసి రాఘవ లారెన్స్ భయపడుతున్నారు’’ అని రాఘవ లారెన్స్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పిక్ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. చంద్రముఖి మొదటి భాగంలో రజినీకాంత్, వడివేలుల మధ్య హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే, రెండో భాగంలో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-02-23T17:52:30+05:30 IST