Rajinikanth: 'చంద్రముఖి 2' విడుదలకి ముందు సూపర్ స్టార్ కాళ్ళకి మొక్కిన రాఘవ లారెన్స్

ABN , First Publish Date - 2023-09-26T11:20:46+05:30 IST

'చంద్రముఖి' అనగానే రజినీకాంత్, జ్యోతిక, పి వాసు కాంబినేషన్లో అప్పుడెప్పుడో వచ్చిన సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' ని దర్శకుడు పి వాసు చేస్తున్నారు, ఇందులో రాఘవ లారెన్స్ కథానాయకుడు. ఈ సినిమా విడుదలకి ముందు లారెన్స్ తన అభిమాన నటుడు రజినీకాంత్ ని కలిశాడు

Rajinikanth: 'చంద్రముఖి 2' విడుదలకి ముందు సూపర్ స్టార్ కాళ్ళకి మొక్కిన రాఘవ లారెన్స్
Raghava Lawrence met Rajinikanth in Chennai

దర్శకుడు పి వాసు (PVasu), ఇంతకు ముందు రజినీకాంత్ (Rajinikanth) తో 'చంద్రముఖి' #Chandramukhi సినిమా తీశారు. అది పెద్ద హిట్ అయింది. అందులో జ్యోతిక (Jyothika) నటన హైలైట్ అయింది. అలాగే నయనతార (Nayanthara) కథానాయికగా నటించింది, ప్రభు (Prabhu) జ్యోతిక భర్తగా అందులో వేశారు. ఆ సినిమాని నిర్మించింది కూడా ప్రభు, అతని సోదరుడు రామ్ కుమార్. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా 'చంద్రముఖి 2' (Chandramukhi2). దీనికి కూడా దర్శకుడు పి వాసు, అయితే కథానాయకుడు మాత్రం రాఘవ లారెన్స్ (RaghavaLawrence). కంగనా రనౌత్ (Kangana Ranaut) చంద్రముఖి గా కనిపించనుంది ఈ సీక్వెల్ లో.

chandramukhi3.jpg

ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. అయితే ఈ విడుదలకి ముందు ఇందులో కథానాయకుడిగా వేసిన రాఘవ లారెన్స్ తన అభిమాన నటుడు, మెంటర్ రజనీకాంత్ ని కలిసి అతని ఆశీర్వచనాలు తీసుకున్నాడు. రజినీకాంత్ నటించిన 'జైలర్' చాలా పెద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా విజయం అందుకోవటం పట్ల రజినీకాంత్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, తన సినిమా 'చంద్రముఖి 2' విడుదల సందర్భంగా అతని ఆశీస్సులు కూడా తీసుకున్నాడు రాఘవ లారెన్స్. రజినీకాంత్ అంటే లారెన్స్ ని ఎనలేని అభిమానం, అందుకనే సూపర్ స్టార్ కాళ్ళకి మొక్కి మరీ ఆశీర్వచనాలు తీసుకున్నాడు. తమిళ ప్రేక్షకుల్లో రజినీకాంత్ అభిమానులు ఎక్కువ, వాళ్ళు కూడా ఈ 'చంద్రముఖి 2' కి సపోర్ట్ చేస్తారు అని లారెన్స్ అనుకోవచ్చు.

Updated Date - 2023-09-26T11:20:46+05:30 IST