Ashok Selvan marriage: చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న తమిళ నటుడు, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-09-13T13:12:57+05:30 IST

ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్ సింపుల్ గా జరిగిన వేడుకలో తమిళ నటి రమ్య పాండియన్ సోదరి, కీర్తి పాండియన్ ని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

Ashok Selvan marriage: చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న తమిళ నటుడు, ఫోటోస్ వైరల్
Ashok Selvan ties the knot with Keerthi Pandian

తమిళ నటుడు అశోక్ సెల్వన్ (AshokSelvan) ఒక ఇంటివాడయ్యాడు. తమిళ పరిశ్రమలో కథానాయికగా వెలుగొందుతున్న రమ్య పాండియన్ (RamyaPaniyan) సోదరి కీర్తి పాండియన్ (KeerthyPandian) అతి సాధారణంగా జరిగిన ఒక వేడుకలో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సాంఘిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. అశోక్ సెల్వన్ నటించిన 'పోర్ తొజిల్' (Por Thozhil) అనే సినిమా సోనీ లివ్ లో ఈమధ్యనే విడుదలై మంచి ప్రసంశలు అందుకుంది.

ashokselvan.jpg

అశోక్ సెల్వన్ తమిళంలో ఇప్పుడు ఒక ప్రాముఖ్యం వున్న నటుడు. ఇతనికి 'సూధు కవ్వుమ్' (Soodhu Kavvum) అనే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది, ఇది 2013లో విడుదలైంది. ఆ తరువాత 'పిజా 2', 'తెగిడి' అనే సినిమాలు కూడా మంచి విజయాన్ని ఇవ్వటంతో అప్పటి నుండి అశోక్ సెల్వన్ ఇక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ashokselvan2.jpg

చెన్నై లోయల కాలేజీ (LoyolaCollege) నుండి విజువల్ కమ్యూనికేషన్ నుండి పట్టభద్రుడు అయినా అశోక్ సెల్వన్ మొదట్లో చాలా షార్ట్ ఫిలిమ్స్ నటించేవాడు, దర్శకత్వం కూడా చేసాడు. ఎస్ జె సూర్య దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా చేరి, ఆలా చాలా సినిమాలకి ఆడిషన్ కి వెళ్ళాడు నటుడిగా, కానీ ఎవరూ అతన్ని గుర్తించలేదు. అప్పుడు దర్శకుడు నలన్ కుమారస్వామి తన సినిమా 'సూధు కవ్వుమ్' లో అశోక్ సెల్వన్ కి ఒక మంచి పాత్ర ఇవ్వటంతో, అప్పటి నుండి నటుడిగా కొనసాగాడు.

ashokselvan3.jpg

ఇప్పుడు నటుడిగా మంచి పేరు తెచుకున్నాక జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకొని, తనకి తెలిసిన కీర్తి పాండియన్ ని వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమ వివాహం అని తమిళ పరిశ్రమలో టాక్ నడుస్తోంది

Updated Date - 2023-09-13T13:12:57+05:30 IST