Rajinikanth: ‘జైలర్‌’ లో మాలీవుడ్ సూపర్ స్టార్

ABN , First Publish Date - 2023-01-08T20:35:43+05:30 IST

సౌతిండియాలోని సూపర్ స్టార్స్‌లో రజినీ కాంత్ (Rajinikanth) ఒకరు. తన నటన, స్టైల్‌తో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరగా ‘అన్నాత్తే’ లో నటించాడు. ఈ చిత్రం కోలీవుడ్‌లో విజయం సాధించినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Rajinikanth: ‘జైలర్‌’ లో మాలీవుడ్ సూపర్ స్టార్

సౌతిండియాలోని సూపర్ స్టార్స్‌లో రజినీ కాంత్ (Rajinikanth) ఒకరు. తన నటన, స్టైల్‌తో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరగా ‘అన్నాత్తే’ లో నటించాడు. ఈ చిత్రం కోలీవుడ్‌లో విజయం సాధించినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ‘జైలర్’ (Jailer) లో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ 60శాతానికీ పైగా పూర్తయింది. ఈ మూవీలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటిస్తున్నాడని కొంతకాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ రూమర్స్ అన్నింటికీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పక్చర్స్ క్లారిటీ ఇచ్చింది.

Mohanlal.jpg

‘జైలర్’ లో మోహన్ లాల్ నటిస్తున్నాడని సన్ పిక్చర్స్ అధికారికంగా తెలిపింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను అభిమానులతో పంచుకుంది. మోహన్ లాల్ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్‌ను చూసే అవకాశం వస్తుండటంతో హీరోల అభిమానులకు పండగే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘జైలర్’ లో కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ (Shivarajkumar) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే శివ రాజ్‌కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘జైలర్’ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, వినాయకన్, యోగి బాబు, వసంత్ రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2023-01-08T20:38:19+05:30 IST