Jailer: రజినీకాంత్ సినిమాలో మిల్కీ బ్యూటీ

ABN , First Publish Date - 2023-01-19T20:33:22+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు రజినీ కాంత్ (Rajinikanth). తన నటన, స్టైల్‌తో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు.

Jailer: రజినీకాంత్ సినిమాలో మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు రజినీ కాంత్ (Rajinikanth). తన నటన, స్టైల్‌తో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరగా ‘అన్నాత్తే’ లో నటించాడు. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ, రజినీ జోష్‌ను తగ్గించకుండా వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ‘జైలర్’ (Jailer) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ 60శాతానికీ పైగా పూర్తయింది. ‘జైలర్’ క్యాస్టింగ్ సినిమాపై ఆసక్తిని రేకేతిస్తుంది. చిత్రంపై అంచనాలను మరింత పెంచుతుంది.

‘జైలర్’ లో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) నటిస్తుందని సన్ పిక్చర్స్ అధికారికంగా తెలిపింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తమన్నా లుక్‌ను కూడా విడుదల చేసింది. ‘జైలర్’ లో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ (Shivarajkumar) కూడా నటిస్తున్నారు. ‘జైలర్’ చిత్ర బృందం సినిమాలోని కీలక పాత్రల కోసం అన్నిఇండస్ట్రీలకు చెందిన వ్యక్తులను తీసుకుంటుంది. సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, రమ్య కృష్ణ, వినాయకన్, యోగి బాబు, వసంత్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ మూవీ విడుదల కానుందని కోలీవుడ్ మీడియా తెలుపుతుంది.

Updated Date - 2023-01-19T20:33:24+05:30 IST