Leo: విజయ్ సినిమా ఓటిటిలో కానీ విడుదల తేదీలో గందరగోళం

ABN , First Publish Date - 2023-11-20T19:24:35+05:30 IST

విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'లియో', థియేటర్స్ లో విడుదలైనప్పుడు మిశ్రమంగా టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇక్కడ రెండు తేదీలు ప్రకటించి అభిమానులని గందరగోళానికి గురిచేశారు.

Leo: విజయ్ సినిమా ఓటిటిలో కానీ విడుదల తేదీలో గందరగోళం
Lokesh Kanagaraj and Vijay

దర్శకుడు లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj) కి తెలుగులో ఎక్కువ అభిమానులు వున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అంటూ ఇంతకు ముందు కమల్ హాసన్ (KamalHaasan) తో 'విక్రమ్' #Vikram, అంతకన్నా ముందు 'ఖైదీ' #Khaidi, 'మాస్టర్' #Master లాంటి సినిమాలు చేసిన లోకేష్ తరువాత విజయ్ తో 'లియో' #Leo సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలైంది, కానీ ఈ సినిమాకి మిశ్రమ స్పందన మాత్రమే వచ్చింది. తమిళంలో బాగా ఆడింది అని అంటున్నారు, కానీ తెలుగులో మాత్రం అంతగా నడవలేదు.

Leo-2.gif

త్రిష (Trisha) కథానాయకురాలు ఈ సినిమాలో, ఇతర ముఖ్య పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVasudevMenon), సంజయ్ దత్ (SanjayDutt), అర్జున్ సర్జా, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్ (MadonnaSebastian) నటించారు. ఈ సినిమా ఎప్పుడు ఓటిటి లో వస్తుందా అని అటు విజయ్ అభిమానులు, ఇటు లోకేష్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ముందుగా నవంబర్ 16 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది అనే వార్త వైరల్ అయింది, కానీ తరువాత ఆ వార్త తప్పని తేలింది. (Leo is streaming on Netflix)

అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ #Netflix ఈ సినిమా ఎప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయం సాంఘీక మాధ్యమంలో ప్రకటించింది. అయితే ఇందులో కూడా రెండు తేదీలు ప్రకటించి మరోసారి గందరగోళానికి తెరతీసింది. ఆ ప్రకటన ప్రకారం ఈ 'లియో' సినిమా ఇండియాలో నవంబర్ 24 న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ప్రపంచం అంతటా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా రెండు తేదీలు ప్రకటించటంతో అభిమానులు కొంచెం గందరగోళానికి గురయ్యారు.

Updated Date - 2023-11-21T13:44:17+05:30 IST