LEO OTT: ఆన్ లైన్లో ’లియో‘ హెచ్డీ లీక్‌.. ముందుగానే ఓటీటీలోకి

ABN , First Publish Date - 2023-11-05T18:57:52+05:30 IST

దసరా పండుగ సందర్భంగా విడుదలైన లియో అనుకున్న సమయాని కన్నా ముందుగానే సినీ అభిమానులను అలరించనుంది. తాజాగా ఈ సినిమా నెట్టింట‌ హెచ్డీ వెర్ష‌న్ లీక్ అవ‌డంతో చిత్రాన్ని న‌వంబ‌ర్ 16న గానీ 17న గానీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

LEO OTT: ఆన్ లైన్లో ’లియో‘ హెచ్డీ లీక్‌.. ముందుగానే ఓటీటీలోకి
leo

దసరా పండుగ సందర్భంగా విడుదలైన లియో(LEO) అనుకున్న సమయాని కన్నా ముందుగానే సినీ అభిమానులను అలరించనుంది. తాజాగా ఈ సినిమా నెట్టింట‌ హెచ్డీ వెర్ష‌న్ లీక్ అవ‌డంతో చిత్రాన్ని న‌వంబ‌ర్ 16న గానీ 17న గానీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్రఖ్యాత ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ముంద‌స్తుగా నిర్మాత‌ల‌తో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం దీపావ‌ళి పండుగ అయిపోయిన‌ త‌ర్వాతి వారం అంటే న‌వంబ‌ర్ 21న విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ట్లు ఈ మ‌ధ్య వార్త‌లు వైర‌ల్ అయ్యాయి గానీ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.


ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాలో ద‌ళ‌ప‌తి విజ‌య్ (vijay), త్రిష జంట‌గా న‌టించ‌గా కాగా అర్జున్‌, సంజ‌య్‌ద‌త్, మ‌డోనా సెబాస్టియ‌న్(Madonna Sebastian), గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు పోషించారు.

ఎల్సీయూలో భాగంగా విక్ర‌మ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత‌ లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అంత‌టా విజ‌య‌వంతంగా న‌డుస్తూ రూ.522 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి హ‌య్యెస్ట్ గ్రాస్‌డ్ త‌మిళ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

Updated Date - 2023-11-05T19:00:48+05:30 IST