Vishal: 'మార్క్ ఆంథోనీ'కి న్యాయపరమైన చిక్కులు, విడుదల వాయిదా పడనుందా...

ABN , First Publish Date - 2023-09-09T13:49:43+05:30 IST

తమిళం, తెలుగులో పేరున్న నటుడు విశాల్ రాబోయే సినిమా 'మార్క్ ఆంటోనీ' వినాయకచవితి సందర్భంగా ఈనెల 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ విశాల్, లైకా ప్రొడక్షన్ సంస్థకి అప్పు వున్న కారణంగా, ఆ సంస్థ కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 'మార్క్ ఆంటోనీ' సినిమా న్యాయపరమైన ఇబ్బందుల్లో వుంది, అందువలన ఈ సినిమా విడుదల అనుమానమే అని అంటున్నారు.

Vishal: 'మార్క్ ఆంథోనీ'కి న్యాయపరమైన చిక్కులు, విడుదల వాయిదా పడనుందా...
Vishal from the film 'Mark Antony'

తెలుగు, తమిళ ప్రేక్షకులలో తన సినిమాలతో పేరు సంపాదించిన నటుడు విశాల్ (Vishal) ఇప్పుడు 'మార్క్ ఆంటోనీ' #MarkAntony అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 15న (September15) విడుదల కావాల్సి వుంది. ఇందులో ఎస్ జె సూర్య (SJSuryah) ఒక ప్రధాన పాత్ర పోషించాడు, దీనికి అధిక రవిచంద్రన్ (AdhikRavichandran) దర్శకుడు. ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా, తెలుగు, ఇంకా మిగతా భాషల్లో కూడా వినాయక చవితి (VinayakaChavithi) సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల చెయ్యడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల జాప్యం అయ్యేటట్టు కనపడుతోంది, ఎందుకంటే ‘మార్క్ ఆంటోని’ (Legal problems for Vishal's 'Mark Atony' film) విడుదలపై నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది అని చెన్నై మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అక్కడ పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ (LykaProductions) నుంచి ఇంతకు ముందు విశాల్ రూ.21 కోట్లు అప్పు తీసుకున్నారని తెలిసింది. ఈ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు, విశాల్ సినిమాలను విడుదల చేసుకునేందుకు వీలు లేదని చెప్పింది.

vishal-markantony.jpg

ఈ ఒప్పందానికి విరుద్ధంగా గత ఏడాది విశాల్ నిర్మించిన ‘వీరమే వాగై సూడుమ్’ (సామాన్యుడు) సినిమాను థియేటర్లలో విశాల్ విడుదల చేశారు. కానీ ‘వీరమే వాగై సూడుమ్’ చిత్రం ఓటిటి హక్కులను కూడా అమ్మడానికి విశాల్ ప్రయత్నం చేస్తే, వాటిని విక్రయించడాన్ని నిషేధించాలని లైకా ప్రొడక్షన్స్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడు విశాల్ ను రూ.15 కోట్లు ఒక జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ కోర్ట్ రిజిస్ట్రార్ పేరా అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించింది. అయితే విశాల్ ఈ డబ్బులు ఇంతవరకు డిపాజిట్ చేసినట్టుగా లేదని, అది చేసేంత వరకు అతని సినిమాలు నిలిపివేసే అవకాశం ఉందని కూడా తెలిసింది.

ఇప్పుడు విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ విడుదల కి సన్నద్ధం అయింది, అయితే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు విశాల్ రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయలేదని కోర్టుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ విన్నవించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకుండా ‘మార్క ఆంటోని’ సినిమాను విడుదల చేస్తున్నారని చెప్పక, సినిమా విడుదలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. అదీ కాకుండా సెప్టెంబర్ 12న విశాల్ ను వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలిసింది. కోర్ట్ ఆదేశాల మేరకు విశాల్ కనక వ్యక్తిగతంగా వెళ్లి రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన అకౌంట్ చూపిస్తే, ‘మార్క్ ఆంటోని’ విడుదల అయ్యే అవకాశాలు వుంటాయని అంటున్నారు.

Updated Date - 2023-09-09T13:49:43+05:30 IST