Bakasuran: ‘బకాసురన్’ దర్శకుడికి కోలీవుడ్ దర్శకుల సంఘం అభినందన
ABN, First Publish Date - 2023-02-22T14:00:47+05:30
ఏ చిత్ర పరిశ్రమైన విభిన్న చిత్రాలు తీస్తూ విజయం సాధించే దర్శకులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.
ఏ చిత్ర పరిశ్రమైన విభిన్న చిత్రాలు తీస్తూ విజయం సాధించే దర్శకులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో కోలీవుడ్ దర్శకుడు జి.మోహన్ (G.Mohan) ఒకరు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన ‘పళయ వణ్ణార్‌పేట’, ‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ హిట్లుగా నిలిచాయి. ఆ సక్సెస్‌ని కొనసాగిస్తూ.. ‘బకాసురన్’ (Bakasuran) సినిమాతో మరో హిట్ సాధించారు. దర్శకుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైటెక్ ప్రపంచంలో మొబైల్స్ వినియోగం మహిళలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు జి.మోహన్ అద్భుతంగా తెరకెక్కించారు. విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకులు వీక్షించి, దర్శకుడు మోహన్‌ను అభినందించారు. ఆ తర్వాత దర్శకుడు మోహన్‌ను తమిళనాడు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రత్యేకంగా సన్మానించింది.
ఈ సందర్భంగా ఆర్.కె.సెల్వమణి మాట్లాడుతూ... ఇలాంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి చూడాలన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ను సూపర్బ్‌గా చిత్రీకరించారని అభినందించారు. ‘పళయ వణ్ణార్‌పేట’, ‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మోహన్ తాజాగా ‘బకాసురన్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సెల్వరాఘవన్, నట్టి, రాధారవి, కే.రాజన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించగా.. జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానరుపై నిర్మించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి, ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఉదయకుమార్, కోశాధికారి పేరరసు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Singam Actor: చిలకలను పెంచుకున్నందుకు.. 2.5 లక్షల జరిమానా..