సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kick Shyam: ట్రైలర్‌లో ఆ సీక్రెట్‌ చెప్పలేదు

ABN, First Publish Date - 2023-01-09T21:25:15+05:30

‘రేసుగుర్రం’ (Race Gurram), ‘కిక్‌’ (Kick) వంటి చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అద్భుతంగా నటించిన నటుడు శ్యామ్‌ (Shyam). తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రేసుగుర్రం’ (Race Gurram), ‘కిక్‌’ (Kick) వంటి చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అద్భుతంగా నటించిన నటుడు శ్యామ్‌ (Shyam). తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తున్నారు. తాజాగా విజయ్‌ (Vijay) చిత్రం ‘వారిసు’(Varisu)లో ఆయన నటించారు. ఇందులో విజయ్‌కు సోదరుడిగా కనిపించనున్నారు. అయితే, ‘వారిసు’లో తన పాత్ర గురించి శ్యామ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. స్టోరీ ప్రకారం విజయ్‌కు సోదరుడిగా నటించాను. కుటుంబ బంధాలను వివరించే ఒక కమర్షియల్‌ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌, చెన్నైలలో షూటింగ్‌ చేశాం. ఈ మూవీలో సీనియర్‌ నటి ఖుష్బూ (Kushboo) పాత్ర ఇప్పటివరకు సస్పెన్స్‌. షూటింగ్‌ సమయంలో విజయ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయన ఎందుకు ప్రశాంతంగా ఉంటారో తెలుసుకున్నాను.

అలా ప్రశాంతంగా ఉన్న సమయంలో తన పాత్రకు సంబంధించిన సీన్లు, డైలాగులను ఆయన నెమరు వేసుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి రిహార్సల్‌ లేకుండానే ఆయన సెట్‌కు వచ్చి కెమెరా ముందు నిలబడి దుమ్మురేపుతారు. మిత ఆహారి. వ్యాయామం చేస్తారు. కొన్నేళ్ళుగా ఇలా సాధన చేస్తున్నారని భావించాను. నిజం చెప్పాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించరు. ఇష్టమైన ఆహారాన్ని మోతాదులో తీసుకుంటారు. జిమ్‌కు వెళతారు. ఇప్పటికీ యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించడం ఆయనకు దేవుడిచ్చిన వరం. ఈ సినిమా కాకుండా భరత్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాను. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో తెరకెక్కే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను.. అని వివరించారు. (Kick Shyam about Varisu)

Updated Date - 2023-01-09T21:25:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!