KH234: కమల్, మణిరత్నం కాంబో.. అదిరిపోయే అప్డేట్స్

ABN , First Publish Date - 2023-11-06T16:01:47+05:30 IST

కమల్ హసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కలయికలో వస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. అయితే రేపు నవంబర్ 7 కమల్ జన్మదినం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.

KH234: కమల్, మణిరత్నం కాంబో.. అదిరిపోయే అప్డేట్స్
kamal234

లోక నాయకుడు కమల్ హసన్(Kamal Hasan), మణిరత్నం(Maniratnam) , ఏఆర్ రెహమాన్ కలయికలో ఓ చిత్రం(KH234) వస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. అయితే రేపు నవంబర్ 7 కమల్ జన్మదినం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.

36 సంవత్సరాల తర్వాత కమల్ హసన్, మణిరత్నం కలయికలో నాయకన్ (Nayakan) వంటి కల్ట్ క్లాసిక్ అనంతరం రూపొందుతున్న చిత్రం కావడంతో ఇప్పుడు ఈ సినిమా గురించి దేశమంతటా హైప్స్ పెరిగాయి. దీనికి తోడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, తమిళ స్టార్ జయం రవి, పాన్ ఇండియా స్టార్ దుల్హర్ సల్మాన్(Dulquer Salmaan) తోడవంతో పాటు జాతీయ ఆవార్డు టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాకు పని చేయనుండడంతో అంచనాలు రోజురోజుకు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి..


దసరా పండుగ సందర్భంగా ఆక్టోబర్ 26 ఈ చిత్రం షూటింగ్ ను అధికారికంగా ప్రారంభించి, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో ఈ రోజు నుంచి దుల్హర్ సల్మాన్, త్రిష షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా వారికి ఆహ్వనం పలుకుతూ మేకర్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు చెందిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-11-06T16:13:05+05:30 IST