Karthika Nair: యుఎఈలో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-20T17:43:07+05:30 IST

సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందింది.

Karthika Nair: యుఎఈలో ఏం జరిగిందంటే..

సీనియర్‌ నటి రాధ (Radha Daughter) కుమార్తె కార్తిక నాయర్‌కు (Karthika nair) యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా (Karthika got golden visa) అందింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు కార్తిక. కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి, యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్‌ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్‌ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్‌ అన్నారు.

కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్‌ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు.

Updated Date - 2023-03-20T17:43:08+05:30 IST