సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ilaiyaraaja 1417: ‘నినైవెల్లాం నీయడా’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ABN, First Publish Date - 2023-01-18T21:26:13+05:30

‘ఇసెజ్ఞాని’ ఇళయరాజా సంగీతం సమకూర్చిన 1417వ చిత్రం ‘నినైవెల్లాం నీయడా’ విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇసెజ్ఞాని’ ఇళయరాజా సంగీతం సమకూర్చిన 1417వ చిత్రం ‘నినైవెల్లాం నీయడా’ (Ninaivellam Neeyada) విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా, ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మేనన్‌ తాజాగా విడుదల చేశారు. ఆదిరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ లెగా థియేటర్స్‌ పతాకంపై రాయల్‌బాబు నిర్మించారు.

ప్రిజన్‌ హీరోగా.. మనీషా యాదవ్‌, సినామిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రోహిత్‌ - యువలక్ష్మి, రెడిన్‌ కింగ్‌స్లీ, మనోబాలా, మధుమిత, టౌగర్‌ ఆర్‌.వి. ఉదయకుమార్‌, ముత్తురామన్‌, పీఎస్, తేనప్పన్‌, రంజన్‌ కుమార్‌ తదితరులు నటించారు. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉండగా, అందులో ఒక పాటకు ఇళయరాజా సాహిత్యం కూడా అందించడం విశేషం. ఆయన తనయుడు, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా నేపథ్యగానం చేశారు. పాఠశాల ప్రేమను గుర్తు చేసిన ‘అళగి’, ‘ఆటోగ్రాఫ్‌’, ‘కాదల్‌’, ‘96’ వంటి చిత్రాల బాణీలో రూపొందించిన ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ త్వరలో రిలీజ్‌ చేయనున్నారు.

Updated Date - 2023-01-18T21:26:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!