Sunny Leone: అలాంటి కామెంట్స్‌ను పట్టించుకోను

ABN , First Publish Date - 2023-01-02T16:04:21+05:30 IST

2022లో నేను దక్షిణాది చిత్రాలలోనే అధికంగా నటించాను. కరోనా (Corona) తర్వాత చిత్రపరిశ్రమ ఖండాంతరాలను దాటిపోయింది. దీంతో నటీనటులు తమ..

Sunny Leone: అలాంటి కామెంట్స్‌ను పట్టించుకోను
Sunny Leone in OMG

తనను ఉద్దేశించి చేసే నెగెటివ్‌ కామెంట్ల గురించి అస్సలు పట్టించుకోనని పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్‌ సన్నీ లియోన్‌ (Sunny Leone) అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓ మై ఘోస్ట్‌’ (ఓఎంజీ) (Oh My Ghost) నేడు విడుదలకానుంది. రీసెంట్‌గానే ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె.. చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సన్నీ లియోన్‌ మాట్లాడుతూ..

‘‘2022లో నేను దక్షిణాది చిత్రాలలోనే అధికంగా నటించాను. కరోనా (Corona) తర్వాత చిత్రపరిశ్రమ ఖండాంతరాలను దాటిపోయింది. దీంతో నటీనటులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు విభిన్న పాత్రలను పోషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘ఓ మై ఘోస్ట్‌’ చిత్రంలో నేను యువరాణిగా, దెయ్యంగా నటించాను. బరువైన దుస్తులు ధరించి నటించడం చాలా కష్టంగా అనిపించింది. దెయ్యంగా నటించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ, మేకప్పే చాలా కష్టంగా అనిపించేది. చాలా టైమ్ తీసుకునేది. ఇక నాపై వచ్చే నెగెటివ్‌ కామెంట్లను అస్సలు పట్టించుకోను. పాజిటివ్‌ అంశాలు అనేకం ఉండగా, నెగెటివ్‌ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి కామెంట్స్‌కు దూరంగా ఉండాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను’’ అని సన్నీలియోన్ చెప్పుకొచ్చారు. కాగా, యువన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో పాటు దర్షా గుప్తా, సతీష్‌ తదితరులు నటించారు. (Sunny Leone on Negative Comments)

Updated Date - 2023-01-02T16:04:23+05:30 IST