G Squad: లోకేశ్ కనగరాజ్.. తమిళనాట కొత్త సంసారం

ABN , First Publish Date - 2023-11-28T20:16:42+05:30 IST

తమిళనాట మరో కొత్త సంసారం వెలిసింది. మరో దర్శకుడు సినీ నిర్మాణం వైపు మళ్లాడు. ఇప్పటికే తమిళనాట డైరెక్టర్ శంకర్ ఎస్ పిక్చర్స్, శివ కార్తికేయన్ ఎస్కే పిక్చర్స్, మురుగదాస్, పా రంజిత్ ఇంకా చాలా మంది తమ సంస్థల ద్వారా సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్ ఈ లిస్టులో చేరాడు.

G Squad: లోకేశ్ కనగరాజ్.. తమిళనాట కొత్త సంసారం
LOKESH KANAGARAJ

తమిళనాట మరో కొత్త సంసారం వెలిసింది. మరో దర్శకుడు సినీ నిర్మాణం వైపు మళ్లాడు. గతంలో బాలీవుడ్ లో చాలామంది హీరోలు నటిస్తూనే సొంత ప్రోడక్షన్ హౌజ్ లు ఏర్పాటు చేసుకుని సినిమాలు చేస్తుండగా ఇప్పుడు వారిని అనుసరిస్తూ సౌత్ దర్శకులు, హీరోలు సొంత సంస్థలను స్టార్ట్ చేసి వారు హీరోగా నటించడమే కాకుండా వేరే వారితోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే బడా నిర్మా ణ సంస్థలకు తోడు రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్, మహేశ్ బాబు జీఎంబీ సినిమాస్, సందీప్ రెడ్డి భద్రకాళీ పిక్చర్స్ పేర సినిమాలు తీస్తుండగా, తమిళనాట డైరెక్టర్ శంకర్ ఎస్ పిక్చర్స్, శివ కార్తికేయన్ ఎస్కే పిక్చర్స్, మురుగదాస్, పా రంజిత్ ఇంకా చాలామంది తమ సంస్థల ద్వారా సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంటు న్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్ ఈ లిస్టులో చేరాడు.

నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కు ఇప్పుడు ఒక్క సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేసి జీ స్కౌడ్ (G Squad Production) పేరిట ఓ ప్రోడక్షన్ హౌజ్ ను ప్రారంభించాడు. ‘సినిమాల్లోకి రావాలనుకునే కొత్తవారిని ప్రోత్సహించడానికి, వారిలోని టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు నూతన నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నానని దానికి మీ సహకారం కావాలంటూ’ సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటించాడు.


అదేవిధంగా మొదటి ప్రయత్నంగా కొన్ని సినిమాలు నాకు కావాల్సిన, దగ్గరి మిత్రులతో చేస్తానని అనంతరం బయట కొత్త వారితో చేస్తానన్నారు. ఈ సందర్భంగా తమిళ డైరెక్టర్ కం హీరో విజయ్ తో కలిసి చేయబోయే సినిమాను ఎనౌన్స్ చేశాడు. 29న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం లోకేశ్ రజనీకాంత్ 171 వ చిత్రాన్ని మమ్ముట్టి, శివ కార్తికేయన్ వంటి భారీ స్టార్స్ తో కలిసి చేస్తున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-11-28T20:18:48+05:30 IST