Captain Miller: ‘కిల్లర్ కిల్లర్’.. పవర్ ప్యాక్డ్ ఫస్ట్ సింగిల్ వదిలారు

ABN , First Publish Date - 2023-11-22T19:06:22+05:30 IST

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడిక్‌ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్. ఇటీవ‌ల‌ విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. తాజాగా మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కిల్లర్ కిల్లర్’ పాటని విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

Captain Miller: ‘కిల్లర్ కిల్లర్’.. పవర్ ప్యాక్డ్ ఫస్ట్ సింగిల్ వదిలారు
DANUSH

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్(dhanush kraja) మోస్ట్ అవైటెడ్ పీరియడిక్‌ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్(Captain Miller). ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండ‌గా ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల‌ విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

తాజాగా సినిమా మేకర్స్ 'కెప్టెన్ మిల్లర్‌ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటని విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ (gv prakash) ఈ పాటకు సంగీతం అందించ‌గా, రాకేందుమౌళి పవర్ ఫుల్ లిరిక్స్గా అందించారు. సింగర్ హేమచంద్రతో కలసి హీరో ధనుష్ స్వయంగా ఈ పాటని ఆలపించగా, విజువల్స్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ ని వైల్డ్ అండ్ ఇంటెన్స్ గా ప్రజెంట్ చేసిన ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా అలరించింది.


1930-40 బ్యాక్ డ్రాఫ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌ డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నండ‌గా,ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగాఆల‌రించ‌నుంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. 2024 సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - 2023-11-22T19:12:50+05:30 IST