Arjun Sarja: ప్ర‌ముఖ కమెడియన్ కొడుకుతో.. అర్జున్ కూతురి ఎంగేజ్మెంట్‌

ABN , First Publish Date - 2023-10-28T13:41:19+05:30 IST

యాక్ష‌న్ కింగ్‌ అర్జున్ స‌ర్జా(Arjun Sarja) ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆయ‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య(Aishwarya Arjun) వివాహం ప్ర‌ముఖ‌ త‌మిళ క‌మెడియ‌న్ తంబి రామ‌య్య(Thambi Ramaiah) కుమారుడు ఉమాప‌తి రామ‌య్య (Umapathy Ramaiah)తో జ‌రుగ‌నుంది. ఈమేర‌కు శుక్ర‌వారం చెన్నైలో నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు.

Arjun Sarja: ప్ర‌ముఖ కమెడియన్ కొడుకుతో.. అర్జున్ కూతురి ఎంగేజ్మెంట్‌
arjun

యాక్ష‌న్ కింగ్‌ అర్జున్ స‌ర్జా(Arjun Sarja) ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆయ‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య(Aishwarya Arjun) వివాహం ప్ర‌ముఖ‌ త‌మిళ క‌మెడియ‌న్ తంబి రామ‌య్య(Thambi Ramaiah) కుమారుడు ఉమాప‌తి రామ‌య్య (Umapathy Ramaiah)తో జ‌రుగ‌నుంది. ఈమేర‌కు శుక్ర‌వారం చెన్నైలో నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు. 2013లో విశాల్ హీరోగా వ‌చ్చిన‌ ‘పట్టతు యానై’ (తెలుగులో ధీరుడు) అనే చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వ‌ర్య‌ ఆ త‌ర్వాత తండ్రి ద‌ర్శ‌క‌త్వంలోనే మాతృభాష‌ క‌న్న‌డ‌లో సినిమా చేసింది. ఆపై స‌రైన అవ‌కాశాలు లేక‌ కేరీర్‌కు పుల్ స్టాప్ పెట్టింది.

గ‌త సంవ‌త్స‌రం తెలుగులో విశ్వ‌క్‌సేన్ హీరోగా ఐశ్వ‌ర్య హీరోయిన్‌గా త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే అర్జున్ సినిమా మొద‌లు పెట్టగా ఈ వేడుక‌కు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌జ‌రై క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు కానీ విశ్వ‌క్‌తో వ‌చ్చిన బేధాభిప్రాయాల‌తో మ‌ధ్య‌లోనే సినిమాను నిల‌పివేశారు. త‌ర్వాత నితిన్‌తో కానీ మ‌రో హీరోతో చేస్తామ‌న్నారు కానీ ఇంత‌వ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి స‌మాచారం లేదు. దీంతో ఈ గ్యాప్‌లో అర్జున్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇదిలాఉండ‌గా ఐశ్వ‌ర్య‌, ఉమాప‌తి రామ‌య్య‌ జంట ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ ఏడాది జూన్‌లో రూమ‌ర్లు బాగా వ‌చ్చిన‌ప్ప‌టికీ అర్జున్‌, ఆయ‌న కూతురు గానీ స్పందించ‌ లేదు. ఉమాప‌తి ఐశ్వ‌ర్య క‌న్నా నాలుగేండ్లు ఆల‌స్యంగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా సినిమాలు చేస్తు నిల‌దొక్కుకోనే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డంతో ఇన్నాళ్లు వేచి ఉన్నారు. ఉమాప‌తి ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు త‌మిళ‌ సినిమాల్లో న‌టించినా స‌రైన బ్రేక్ రాలేదు.


ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఇరువైపులా కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో పెళ్లికి సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం ఎంగేజ్మెంట్‌ వేడుక నిర్వ‌హించారు. అయితే ఉమాప‌తి తండ్రి తంబి రామ‌య్య ఫేమ‌స్ క‌మెడియ‌న్ ఆండ్ డైరెక్ట‌ర్ కూడా. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వాళ్ల‌కూ ప‌రిచ‌మయ‌మే. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సాయిద‌ర‌మ్‌తేజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ్రో త‌మిళ మాతృక వినోదాయ సిత్తంలో ఇత‌నే హీరో. అయితే 2021లో జీ త‌మిళ్‌లో అర్జున్ హోస్ట్ గా వ‌చ్చిన రియాలిటీ షో స‌ర్వైవ‌ర్‌లో ఉమాప‌తి పాల్గొన‌డం కొస‌మెర‌పు.

Updated Date - 2023-10-28T17:24:10+05:30 IST