Suriya : కార్తి 25వ సినిమా.. అలాంటి హిట్‌ కావాలి

ABN , First Publish Date - 2023-10-29T17:07:58+05:30 IST

‘లోకేశ్‌ కనగరాజ్‌ ఇచ్చిన ‘రోలెక్స్‌’ పాత్ర నా కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది’ అని హీరో సూర్య అన్నారు. కార్తి హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ‘జపాన్‌’ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Suriya : కార్తి 25వ సినిమా.. అలాంటి హిట్‌ కావాలి

‘లోకేశ్‌ కనగరాజ్‌ ఇచ్చిన ‘రోలెక్స్‌’(Rolex) పాత్ర నా కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది’ అని హీరో సూర్య (suriya) అన్నారు. కార్తి (karthi) హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ‘జపాన్‌’(Japan) చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా తమ్ముడు కార్తి నటించిన 25వ చిత్రమిది. నాకు ‘సింగం’ ఎంతటి విజయాన్ని అందించిందో.. కార్తికి ‘జపాన్‌’ అంతటి విజయం సాధించాలని కోరుకుంటున్నా. నా తదుపరి చిత్రం ‘కంగువా’ కోసం ఫ్యాన్స ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ఫ్యాన్స సెలబ్రేట్‌ చేసుకుంటారు. లోకేశ్‌ కనగరాజ్‌ ఇచ్చిన ‘రోలెక్స్‌’ పాత్ర పూర్తిగా నా కెరీర్‌నే మార్చేసింది. ‘డిల్లీ (ఖైదీ 2)’ ఎప్పుడైతే వస్తాడో.. అదే సమయంలో రోలెక్స్‌ కూడా తిరిగి వస్తాడని నేనూ వింటున్నా’’ అని సూర్య అన్నారు.

‘‘మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా నా కెరీర్‌ మొదలుపెట్టా. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే ఇక్కడి వరకూ రాగలిగా. నాతో ఓ సినిమా చేయమని ఏ దర్శకుడిని అడగలేదు. రాజు మురుగన్‌ని మాత్రం అడిగా. రిపోర్టర్‌ నుంచి ఆయన దర్శకుడిగా మారారు. ‘జపాన్‌’ నాకెంతో నచ్చి చేసిన చిత్రం. అద్భుతమైన కంటెంట్‌ను వినోదభరితంగా తెరకెక్కించారు’’ అని కార్తి తెలిపారు. తమిళనాడులోని బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్‌ చేేస వ్యక్తిగా కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-10-29T17:07:58+05:30 IST