Suriya 42: : టైటిల్‌ ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-16T16:11:30+05:30 IST

సూర్య (Suriya)హీరోగా నటిస్తున్న (Suriya 42) 42వ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ఆడియన్స్‌ కూడా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Suriya 42: : టైటిల్‌ ఏంటో తెలుసా?

సూర్య (Suriya)హీరోగా నటిస్తున్న (Suriya 42) 42వ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ఆడియన్స్‌ కూడా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. శివ (Director Shiva) ఈ చిత్రానికి దర్శకుడు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం మొదలైంది. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ ఏంటా అని చర్చ మొదలైన తరుణంలో చిత్ర బృందం దీంతో మూవీ టైటిల్‌ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ‘కంగువ’ అనే టైటిల్‌ను ప్రకటించింది స్టూడియో గ్రీన్‌ నిర్మాణ సంస్థ. కంగువ (Kanguva) అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి - అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. త్రీడీలో (kanguva in 3d) పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉండాలని కామన్‌గా అన్ని భాషలకు ఈ టైటిల్‌ పెట్టినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. గోవా, చెన్నైతోపాటు పలు లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. వచ్చే నెలలో బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేయనున్నారు.

టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు వీఎఫ్‌ఎక్స్‌, సీజీ వర్క్‌ ఎక్కువగా ఉండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వచ్చే ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్తాన్‌ చేస్తున్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘సూర్య 42వ చిత్రం కంగువ అనే టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉంది. సూర్య చాలా గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైన చిత్రం’’ అని అన్నారు. స్టూడియో గ్రీన్‌, యువి క్రియేషన్స్‌ వంశీ-ప్రమోద్‌తో కలిసి కె.ఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-04-16T16:11:50+05:30 IST