Siva karthikeyan 21 : కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి!

ABN , First Publish Date - 2023-08-31T19:14:29+05:30 IST

శివకార్తికేయన్‌ హీరోగా ఉలగనాయగన్‌ కమల్‌ హాసన్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. శివ కార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవల కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందీ చిత్రం.

Siva karthikeyan 21 : కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి!

శివకార్తికేయన్‌ హీరోగా ఉలగనాయగన్‌ కమల్‌ హాసన్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. శివ కార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవల కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందీ చిత్రం.

3.jpg

75 రోజులపాటు జరిగిన ఈ షెడ్యుల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాశ్మీర్‌లోని అద్బ్భుతమైన లొకేషన్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచబోతున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. శివ కార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్‌ స్ర్కీన్‌పై ఆవిష్కరించనున్నారు దర్శకుడు. ‘గట్స్‌ అండ్‌ గోర్‌’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. జి వి ప్రకాష్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Updated Date - 2023-08-31T19:14:29+05:30 IST