Shruti Haasan: ఈ ఏడాది అలా మొదలై.. ఇలా ముగిసింది.. అందుకే ప్రత్యేకం! 

ABN , Publish Date - Dec 26 , 2023 | 05:16 PM

‘సలార్‌’ (Salaar)చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది చిత్ర కథానాయిక శ్రుతీహాసన్ (Shruthi haasan). ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఆద్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు

Shruti Haasan: ఈ ఏడాది అలా మొదలై.. ఇలా ముగిసింది.. అందుకే ప్రత్యేకం! 

‘సలార్‌’ (Salaar)చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది చిత్ర కథానాయిక శ్రుతీహాసన్ (Shruthi haasan). ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఆద్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు శ్రుతీహాసన్. ప్రభాస్‌ పక్కన నటించడం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ‘సలార్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి (Rajamouli) చేసిన ఇంటర్వ్యూ గురించి ఆమె మాట్లాడారు. 

‘‘ప్రభాస్‌ స్నేహశీలి. అందరితో సరదాగా ఉంటాడు. ఆఫ్‌ స్క్రీన్ లో  ఎంత సరదాగా ఉంటాడో కెమెరా ముందుకు వెళ్లగానే పూర్తి భిన్నంగా మారిపోతాడు. నేను ఈ ప్రాజెక్ట్‌ను సైన్  చేసినప్పుడు సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని అనుకున్నాను. ప్రశాంత్‌ నీల్‌ ప్రపంచంలో నేనూ భాగమైనందుకు సంతోషించాను. ‘సలార్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు నన్ను పొగడడం ఎప్పటికీ మర్చిపోలేను. నా డ్యాన్స్‌ ఆయనకు నచ్చిందని చెప్పడమే నాకు పెద్ద ప్రశంస. ఈ ఏడాది నాకెంతో స్పెషల్‌. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోల సినిమాలతో ప్రారంభమైన ఈ సంవత్సరం ప్రభాస్‌ సినిమాతో ముగిసింది. అంతే కాదు ఈ ఏడాది నేను పాడిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌కు కూడా మంచి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం చేస్తున్న 'ది ఐ’ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. అలాగే అడివి శేష్‌తో ‘డకాయిట్‌’లో చేస్తున్నా. 2024లో ఇలాంటి రెండు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. 

Updated Date - Dec 26 , 2023 | 05:34 PM