Indian-2: లాస్‌ ఏంజెల్స్‌ ‘లోలా’లో శంకర్‌... అత్యాధునిక టెక్నాలజీతో సినిమాకు భారీతనం!

ABN , First Publish Date - 2023-07-23T16:25:51+05:30 IST

ప్రస్తుతం శంకర్‌ లాస్‌ ఏంజిల్స్‌లో ‘ఇండియన్‌ 2’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ప్రారంభించారు. ఈ చిత్రం కోసం లాస్‌ ఏంజెల్స్‌లోని ‘లోలా వీఎఫ్‌ఎక్స్‌’ కంపెనీని ఆయన అప్రోచ్‌ అయ్యారు. ఈ చిత్రం కోసం అత్యాధునిక టెక్నాలజీతో వీఎఫ్‌ఎక్స్‌ చేయించే పనిలో శంకర్‌ ఉన్నారు. అక్కడి ‘లోలా’ స్టూడియోలో టెక్నాలజీ శంకర్‌ స్కాన్‌ చేస్తున్నారు. దానిలో ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుంటున్నారు.

Indian-2: లాస్‌ ఏంజెల్స్‌ ‘లోలా’లో శంకర్‌... అత్యాధునిక టెక్నాలజీతో సినిమాకు భారీతనం!

శంకర్‌ (S. Shankar) అంటే బలమైన కథ, భారీతనం, కళ్లు జిగేల్‌మనే సెట్లు, అంతకుమించి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, భాషతో సంబంధం లేకుండా అందుకునే విజయాలు. హీరో ఎవరైనా ఆయన తెరకెక్కించే చిత్రాల్లో ఈ అంశాలు పక్కాగా ఉంటాయి. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్‌ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే! శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఎంత అద్భుతంగా నటించారో తెలిసిందే! అద్బుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపై పోరాటం నేపథ్యంలో సాగిన ఇలాంటి చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి ఎండ్‌ కార్డ్‌ వేస్తూ శంకర్‌ ‘ఇండియన్‌-2’ (indian 2) చిత్రాన్ని ప్రకటించారు. కమల్‌ సరసన కాజల్‌, రకుల్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ మొదలై కూడా దాదాపు 5 ఏళ్లు కావొస్తుంది. కరోనా, నిర్మాణ సంస్థతో విబేధాలు ఇలా పలు కారణాలతో షూటింగ్‌ ఆలస్యమైంది. ఏడాదిగా ఆ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం శంకర్‌ లాస్‌ ఏంజిల్స్‌లో ‘ఇండియన్‌ 2’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ (LOLA VFX)పనులు ప్రారంభించారు. ఈ చిత్రం కోసం లాస్‌ ఏంజెల్స్‌లోని ‘లోలా వీఎఫ్‌ఎక్స్‌’ కంపెనీని ఆయన అప్రోచ్‌ అయ్యారు. ఈ చిత్రం కోసం అత్యాధునిక టెక్నాలజీతో వీఎఫ్‌ఎక్స్‌ చేయించే పనిలో శంకర్‌ ఉన్నారు. అక్కడి ‘లోలా’ (LOla Studio in LA) స్టూడియోలో టెక్నాలజీ శంకర్‌ స్కాన్‌ చేస్తున్నారు. దానిలో ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఓ ఫొటో షేర్‌ చేసి తెలిపారు శంకర్‌.

‘లోలా వీఎఫ్‌ఎక్స్‌’ (LOLA VFX) సంస్థ 'మిషన్‌ ఇంపాజిబుల్‌’, '300', 'అవతార్‌', ‘ఐరన్‌ మ్యాన్‌’ సిరీస్‌, ‘స్కైఫాల్‌’, టెర్మినేటర్‌, అవేంజర్స్‌ సిరీస్‌, ‘ఘోస్ట్‌ ఇన్‌ ద షెల్‌’, 'జురాసిక్‌ వరల్డ్‌', 'రాబిన్‌ హుడ్‌', కిస్టోఫర్‌ రాబిన్‌, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ వంటి భారీ చిత్రాలకు వర్క్‌ చేస్తోంది. అలాంటి అగ్ర సంస్థతో శంకర్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేయిస్తున్నారంటే ‘ఇండియన్‌-2’ రేంజ్‌, తెరపై చిత్రం భారీతనం ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ట్విట్టర్‌లో శంకర్‌ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఎక్కడుంటే అక్కడ శంకర్‌ ఉంటాడు.. ఆయన మామూలోడు కాదు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. రామ్‌చరణ్‌ హీరోగా దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇంకాస్త బ్యాలన్స్‌ ఉంది. ప్రస్తుతం శంకర్‌ ‘ఇండియన్‌-2’తో బిజీగా ఉన్నారు. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ పరిస్థితి ఏంటి? అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు శంకర్‌ను నిలదీస్తున్నారు. రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ప్రెగ్నెంట్‌ కావడం, ప్రసవం సమయం దగ్గర పడటంతో చరణ్‌ గత నెల రెండోవారం నుంచి షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. గత నెల 20న చరణ్‌ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ ఆ పనుల నుంచి కాస్త ఫ్రీ అయ్యారు. శంకర్‌ అమెరికా నుంచి రాగానే ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-07-23T16:25:51+05:30 IST