Rishab shetty: క‌ల‌ల్ని మూట‌గ‌ట్టుకుని ఇండ‌స్ట్రీకి వచ్చా

ABN , First Publish Date - 2023-07-09T15:12:39+05:30 IST

గత ఏడాది విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ‘కాంతార’ అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావటంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అన్నీ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిష‌బ్ శెట్టి టాక్ ఆఫ్ ది ఇండియ‌న్ ఇండ‌స్ట్రీగా మారారు.

Rishab shetty: క‌ల‌ల్ని మూట‌గ‌ట్టుకుని  ఇండ‌స్ట్రీకి వచ్చా

గత ఏడాది విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ‘కాంతార’ (kanthara) అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావటంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అన్నీ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిష‌బ్ శెట్టి (Rishab shetty) టాక్ ఆఫ్ ది ఇండియ‌న్ ఇండ‌స్ట్రీగా మారారు. ఇప్పుడు ఆయ‌న ‘కాంతార 2’ (Kanthara 2) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూలై 7న రిష‌బ్ శెట్టి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి ప్ర‌గ‌తి రిష‌బ్ శెట్టి ఫౌండేష‌న్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా బెంగుళూరులో రిష‌బ్ పుట్టిన‌రోజు వేడుల‌క‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. అయన అభిమానులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

2.jpg

ఈ సంద‌ర్భంగా రిషబ్ మాట్లాడుతూ ‘‘ప‌ల్లెటూరి నుంచి క‌ల‌ల్ని మూట‌గ‌ట్టుకుని సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడిని నేను. ఇవాళ మీ అంద‌రి ఆద‌రాభిమానాలు చూర‌గొన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అందరు ఆద‌రించ‌డం వ‌ల్ల‌నే ఈ సినిమా గ్లోబ‌ల్ సినిమా అయింది. ప్రేక్ష‌కుల‌కు నా కృత‌జ్ఞ‌తలు తెలుపుకోవ‌డానికి ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నాను. అది సాకార‌మైంది. నా కోసం, న‌న్ను చూడ‌టం కోసం అభిమానులు వ‌ర్షాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా నిలుచున్న తీరు నా మ‌న‌సును తాకింది. వాళ్ల అంకిత భావం ప‌ట్ల గౌర‌వం పెరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు వారి అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను. ఆ రుణం తీర్చుకోలేనిది. కాంతార స‌క్సెస్‌ని క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు అంకిత‌మిచ్చారు" రిష‌బ్ శెట్టి.

563.jpg

Updated Date - 2023-07-09T15:12:39+05:30 IST