Red card : ఆ కారణాలతో రెడ్‌ కార్డ్‌..

ABN , First Publish Date - 2023-09-14T18:07:45+05:30 IST

తమిళ స్టార్‌ హీరోలకు నిర్మాతల మండలి షాక్‌ ఇచ్చింది. ధనుష్‌, విశాల్‌, అథర్వ, శింబులకు రెడ్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతలమండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Red card : ఆ కారణాలతో రెడ్‌ కార్డ్‌..

తమిళ స్టార్‌ హీరోలకు(kollywood) నిర్మాతల మండలి షాక్‌ ఇచ్చింది. ధనుష్‌(Dhanush), విశాల్‌(Vishal), అథర్వ, శింబులకు (Simbhu) రెడ్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతలమండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్‌ కార్డు జారీ చేయనుంది. ఈ వివాదంపై పలుమార్లు చర్చలు జరిగిపా శింబులో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ ఓ చిత్రం చేస్తానని అంగీకరించి, 80 శాతం షూట్‌ పూర్తయ్యాక.. చిత్రీకరణ విషయంలో ఆయన ఆసక్తి కనబరచలేదని.. దాని వల్ల నిర్మాతకు నష్టం వాటిల్లిందని మండలి ఈ సందర్భంగా తెలిపింది. ఈ కారణంతోనే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అథర్వ మురళీ మదియలకన్‌ నిర్మాణ సంస్థతో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు ఏమాత్రం సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-09-14T18:10:02+05:30 IST