Ravindar Chandrasekaran : నమ్మించి మోసం చేసిన నిర్మాత!

ABN , First Publish Date - 2023-09-08T19:04:12+05:30 IST

కోలీవుడ్‌ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ను (Ravindra Chandrasekharan) చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో.. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

Ravindar Chandrasekaran : నమ్మించి మోసం చేసిన నిర్మాత!

కోలీవుడ్‌ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ను (Ravindra Chandrasekharan) చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో.. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. ఘనవ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌ విషయంలో బాలాజీ అనే ఓ వ్యాపారవేత్తకు నకిలీ పత్రాలు చూపించి.. రూ.15.83కోట్లు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఘనవ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేేస ప్రాజెక్ట్‌లో అధిక లాభాలు గడించవచ్చని బాలాజీ అనే ఓ వ్యాపారవేత్తను రవీందర్‌ నమ్మించారు.

దాంతో ఆయన రూ.15.83 కోట్లను రవీందర్‌కు ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ కోసం 2020 సెప్టెంబర్‌17న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి దాకా రవీందర్‌ ఆ వ్యాపారం మొదలుపెట్టకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఆ కారణంతో బాలాజీ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యాపారవేత్త నుంచి పెట్టుబడుల కోసం రవీందర్‌ నకిలీ పత్రాలు చూపించినట్లు విచారణలో తేలింది. ఐపీఎస్‌ అధికారి సందీప్‌ రాయ్‌ రాథోడ్‌ ఆదేశాల మేరకు రవీందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. (Crime Branch)

Updated Date - 2023-09-08T19:16:49+05:30 IST