Ravi Kishan: క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా.. ఆ నటితో నాకు సంబంధం లేదు!

ABN , First Publish Date - 2023-03-27T18:49:00+05:30 IST

‘రేసుగుర్రం’ చిత్రం పేరు చెప్పగానే గుర్తొచ్చే కీలక పాత్రల్లో మద్దాళి శివారెడ్డి పాత్ర ఒకటి. గుర్తొచ్చే ఆర్టిస్ట్‌ భోజపురి నటుడు, బీజేపీ నేత రవికిషన్‌.

Ravi Kishan: క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా.. ఆ నటితో నాకు సంబంధం లేదు!

‘రేసుగుర్రం’ (Race gurram) చిత్రం పేరు చెప్పగానే గుర్తొచ్చే కీలక పాత్రల్లో మద్దాళి శివారెడ్డి పాత్ర ఒకటి. గుర్తొచ్చే ఆర్టిస్ట్‌ భోజపురి నటుడు, బీజేపీ నేత రవికిషన్‌. ఆ సినిమా తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు. తాజాగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కెరీర్‌ బిగినింగ్‌లో తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను (Casting couch) ఎదుర్కొన్నానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గతంలో ఓ మహిళ తనని ఇబ్బందిపెట్టాలని చూసిందని, ప్రస్తుతం ఆమెకు సమాజంలో పేరు, పలుకుబడి ఉందని అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ఇండస్ర్టీలోకి వచ్చిన తొలినాళ్లల్లో చాలా సవాళ్లు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నా. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది సినిమా ఇండస్ట్రీలో సాధారణం అని తెలుసు. నేనూ అలాంటి పరిస్థితిని చూశా. ఒకానొక సమయంలో ఓ మహిళ నా వద్దకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం’ అని అడిగింది. నాకెందుకో అనుమానం వచ్చి.. సున్నితంగా తిరస్కరించా. ఆమె ఎవరనేది ఇప్పుడు బయట పెట్టను. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు సోసైటీలో ఎంతో పేరు ఉంది’’ అని రవికిషన్‌ అన్నారు.

నగ్మాతో (Relation with Nagma) రిలేషన్‌లో ఉన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ‘‘నటీనటులు కలిసి వరుసగా సినిమాల్లో నటిస్తే వాళ్ల మధ్య సంబంధం ఉందని వార్తలు వండేస్తారు. నిజానికీ అవన్నీ వాస్తవాలు కావు. మేము కలిసి నటించిన సినిమాలు హిట్స్‌ కావడంతో మళ్లీ మా కాంబినేషన్‌ రిపీట్‌ అయింది. మేమిద్దరం మంచి స్నేహితులం. మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పటికే నాకు పెళ్లి అయిందని అందరికీ తెలుసు’’ అని అన్నారు.

2.jpg

Updated Date - 2023-03-27T19:09:28+05:30 IST